AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘ఆ ఫ్లాప్ సినిమా నాకెన్నో పాఠాలు నేర్పింది.. కసితో పనిచేశా’: అల్లు అర్జున్

ముంబై వేదికగా జరుగుతోన్న వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్) కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బన్నీ.

Basha Shek
|

Updated on: May 01, 2025 | 7:14 PM

Share

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌) ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. మొత్తం 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్ లు పాలు పంచుకోనున్నాయి. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా భారత సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాగా వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఇదే సదస్సు వేదికగా టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ బన్నీని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్.

నాకు 10వ సినిమాలో యాక్సిడెంట్‌ జరిగింది.. ఆరునెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో చాలా భయపడ్డాను. . 18వ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఆ ఫ్లాప్‌ సినిమా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. కానీ కసితో పనిచేశాను. ఈ క్రమంలోనే నేను 20వ సినిమాకు జాతీయ అవార్డును సాధించాను. ఎవరైనా మంచి కోసమే సలహాలు ఇస్తారు. ఎంతోమంది పెద్దలు నాకు సలహాలు ఇస్తారు. నా విషయానికి వస్తే షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచే డాన్స్‌ అంటే ఇష్టం. ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అభిమానులను దృష్టిలో పెట్టుకునే పాత్రల ఎంపిక చేసుకుంటాను. అలాగే విలక్షణ నటన కోరుకుంటాను. నాకు దేశవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు.’ అని చెప్పుకొచ్చారు.

కాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. బన్నీ కెరీర్ లో ఇది 18వ సినిమా. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే