Allu Arjun: ‘ఆ సంఘటనతో చాలా భయపడ్డాను.. కానీ’.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ బరుణ్‌దాస్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబైలో జరుగుతోంది. ఈ సందర్భంగా టీవీ9 నెట్ వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ అల్లు అర్జున్ తో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. మరి ఆ ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబై వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. 90కు పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్ లు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా భారత సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు ఈ సదస్సులో భాగం కానున్నారు. కాగా ఇదే సదస్సు వేదికగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్. అలాగే తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు.
‘చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఇష్టం. దేశవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు. ప్రతి సినిమా నాకు ముఖ్యమే. విలక్షణ నటన కోరుకుంటా
అభిమానులను దృష్టిలో పెట్టుకునే పాత్రల ఎంపిక చేసుకుంటాను. ఒక సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినప్పుడు మాత్రం చాలా భయపడ్డాను. నా 10వ సినిమాలో యాక్సిడెంట్ జరిగింది. దీంతో భయ పడ్డాను. కానీ సవాళ్లు అధిగమించాను. మళ్లీ సినిమాలు చేశాను. నా 20వ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అభిమానుల ఆదరణే నన్ను ఈ స్థాయికి చేర్చింది. సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

