AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: 'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!

Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!

Phani CH
|

Updated on: Mar 01, 2026 | 6:56 PM

Share

విజయ్ దళపతి వ్యక్తిగత జీవితం తమిళనాట రసవత్తరంగా మారింది. భార్య విడాకుల పిటిషన్, త్రిష పేరు ప్రస్తావనతో వ్యవహారం చర్చనీయాంశమైంది. గతంలో త్రిష చేసిన పాత ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారడంతో విజయ్ ప్రత్యర్థులు దాన్ని రాజకీయం చేస్తున్నారు. నైనార్ నాగేంద్రన్‌ వివాదంలోకి లాగడం, త్రిష స్పందనతో ఈ మొత్తం వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది.

విజయ్ దళపతి ఇంటి వ్యవహారం ఇప్పుడు తమిళనాడు స్టేట్‌లో రసవత్తరంగా మారింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో.. దళపతి భార్య విడాకుల కోసం చంగల్పట్టు కోర్టు మెట్లెక్కడం.. ఆ విషయం కాస్తా బయటికి వచ్చి సంచలనంగా మారడం.. ఆ వెంటనే అందరి కళ్లూ త్రిష వైపు మళ్లడం చకచకా జరిగిపోయింది. ఇక ఈక్రమంలోనే ఉన్నట్టుండి త్రిష గతంలో చేసిన ఓ షాకింగ్ ట్వీట్ ఇప్పుడు బయటికి వచ్చింది. విజయ్‌ దళపతికి మరింత తలనొప్పిగా మారింది. ఇటీవల బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్‌ దళపతిని విమర్శిస్తూ.. మధ్యలో త్రిష పేరును ప్రస్తావించాడు. దీంతో సీరియస్ అయిన త్రిష.. నైనార్ తీరుపై తీవ్రంగా స్పందించింది. దీంతో నైనార్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే త్రిష్ ఓ ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. “ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచినా, నీకు నేను అండగా ఉంటాను” మరియు “నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను” అనే అర్థం వచ్చేలా ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసి.. ఆ తరువాత కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు మరోసారి బయటికి తీసిన విజయ్ ప్రత్యర్థులు.. ఇప్పుడు దానిని మళ్లీ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే

Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం

భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

Follow Us