Allu Arjun: నా ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ బరుణ్‌దాస్‌తో అల్లు అర్జున్
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబై వేదికగా గురువారం (మే 01) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భాగంగా టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మొత్తం 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్ లు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొంటున్నాయి. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా భారత సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాగా ఇదే సదస్సు వేదికగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఈ సందర్భంగా వేవ్స్ సమిట్‌ను నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు బన్నీ. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్. ముఖ్యంగా తన ఫిట్ నెస్ కు తన మానసిక ప్రశాంతతే ప్రధాన కారణమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
‘మా తాత అల్లు రామలింగయ్య 1000 సినిమాల్లో నటించారు. మా తండ్రి అల్లు అరవింద్ 70 సినిమాలు నిర్మించారు. మా మామ చిరంజీవి సౌత్‌లో సూపర్‌స్టార్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఈ స్థాయికి వచ్చా. ‘పుష్ప సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రతి నటుడికి ఫిట్‌నెస్ చాలా కీలకం. షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. ఇక సినిమాల్లో సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాను’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. బన్నీ తన గురించి ఇంకేం చెప్పారో పై వీడియోలో చూడొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








