- Telugu News Photo Gallery Cinema photos Samantha did a mistake in that matter of tattoos on their hands
Samantha: చైతు విషయంలో నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది.. ఇప్పుడు బాధపడుతున్న సమంత
సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తెలుగు, తమిళ వంటి పలు భాషల్లో నటించి ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం అందరికి తెలిసిన విషయమే.. యితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
Updated on: May 01, 2025 | 8:00 PM

సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2010లో "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా తో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డు వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఏ మాయ చేసావే సినిమా సమయం లోనే నాగ చైతన్య సమంత ప్రేమించుకుని 2017లో గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. వీరు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

అయితే, 2021 అక్టోబర్ 2న వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి, ధ్యానం ద్వారా తనను తాను సమతుల్యంగా ఉంచుకుంటుందని తెలిపింది.

సమంత, నాగ చైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన టాటూలు వేయించుకున్నారు అయితే వీరు పెళ్ళికి ముందే వీరి చేతి ఒకే రకమైన టాటూలు ఉండటం తో అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారింది. ఆ తరువాత వీరు పెళ్లి చేసుకున్నారు.. కొన్ని రోజులకే విడిపోయారు.

అయితే తాజాగా ఈ టాటూల పై రియాక్ట్ అయిన సమంత విడిపోతామని తెలిస్తే..ఎవరూ కూడా ఇలాంటి పని చేయరు. నేను చెప్పేది ఒక్కటే.. ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు అని గట్టిగా చెప్పుకొచ్చింది సమంత.. అయితే ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి.




