- Telugu News Photo Gallery Cinema photos These are the super hit movies that Akkineni Nagarjuna gave up
ఓరి దేవుడో నాగార్జున ఇన్ని సూపర్ హిట్స్ వదులుకున్నాడా?
అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ మన్మథుడిగా ఈ హీరో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో ఇప్పటి యూత్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటి కుర్రకారుకు తన ఫిట్ నెస్ తో షాకిస్తున్నాడు. ఇక ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? ఈ హీరో బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్నాడంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: May 01, 2025 | 8:33 PM

ఒకప్పుడు వరస సినిమాలో ఫుల్ బిజీగా గడిపిన ఈ హీరో. ప్రస్తుతం సినిమాల విషయంలో తమ అభిమానులను కాస్త నిరాశ పరుస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ హీరో చాలా సినిమాలను వదులుకున్నాడంట. కథ నచ్చక, డేట్స్ ఖాలీలేక ఇలా చాలా కారణాల వలన బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్ చేసుకున్నాడు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి మంచి హిట్ అందుకున్న సినిమాల్లో ఘర్షణ, మౌనరాగం, దళపతి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలకు హీరోగా మొదటగా దర్శకుడు నాగార్జున అనుకున్నాడంట. కానీ పలు కారణాల వలన నాగార్జున ఈ సినిమాలను వదులుకున్నాడు. దీంతో ఇవి వేరే హీరోలు చేసి హిట్ అందుకున్నారు.

ఇవే కాకుండా వివాదాస్పద దర్శకుడు, ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. నాగార్జున లైఫ్‌నే టర్న్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత ఆర్జీవీ నాగ్‌తో రామాయణం చేద్దాం అనుకున్నాడంట. కానీ నాగార్జున దానికి ఒప్పుకోకపోవడంతో ఆర్జీవీ ఆ ప్రాజెక్ట్ వదిలేశాడంట.

మహేష్ బాబు, వెంకటేష్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా వెంకటేష్ స్థానంలో ముందుగా దర్శకుడు నాగార్జుననే అనుకున్నాడంట. కానీ నాగ్ తనకు ఆ పాత్ర సెట్ కాదు అని రిజక్ట్ చేయడంతో ఆ మూవీలోకి విక్టరి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, పూరి జగన్నాథ్ బద్రి సినిమాను నాగార్జునతో చేయాలని భావించారు. కానీ ఈ సినిమాను అక్కినేని నాగార్జున రిజెక్ట్ చేశారంట.ఇవే కాకుండా మెకానిక్ అల్లుడు, ఘర్షణ,కలిసుందాం రా ఇలా చాలా సినిమాలను వదులుకున్నాడంట.



