AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: సడెన్‌గా ఆస్పత్రిలో చేరిన హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నాడు. తన నటనా ప్రతిభకు గుర్తింపుగా, సినిమా రంగంలో అందిస్తున్న సేవలకు ప్రతీకగా కేంద్ర ప్రభుత్వం అజిత్ కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీంతో తలా అభిమానులు సంతోషంలో తేలిపోయారు. అయితే ఇంతలోనే..

Ajith Kumar: సడెన్‌గా ఆస్పత్రిలో చేరిన హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
Ajith Kumar
Basha Shek
|

Updated on: Apr 30, 2025 | 4:08 PM

Share

ప్రముఖ నటుడు అజిత్ ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్‌ పురస్కారం అందుకున్నారు. దీంతో హీరో అభిమానులందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే ఇంతలోనే తలా ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. అదేంటంటే.. అజిత్ కు గాయమైంది. కాలికి దెబ్బ తగలడంతో ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని సూచించారని సమాచారం. అయితే అజిత్ గాయంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోకు ఏమైందోనని కంగారు పడుతున్నారు. దీనిపై స్పందించిన అజిత్ టీమ్ అభిమానులను కంగారు పడొద్దని సూచించింది. అన్నీ పరీక్షలు చేయించిన అనంతరం సాయంత్రం అజిత్ డిశ్చార్జ్‌ అవుతారని హీరో టీమ్ మీడియాకు తెలిపింది. కాగా ఢ పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించిన అనంతరం అజిత్‌ కుటుంబం ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు మంగళవారం (ఏప్రిల్ 29) రాత్రి చేరుకుంది. ఆ సమయంలోనే హీరోకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. చాలామంది నటుడి వైపు దూసుకురావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలోనే అజిత్‌ కాలికి స్వల్ప గాయమైనట్టు టీమ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. అజిత్ కుమార్‌ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది.  అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ సినిమాలో సునీల్, అర్జున్ దాస్, సిమ్రాన్‌ కీలక పాత్రల్లో మెరిశారు. అంతకు ముందు విదాముయార్చి సినిమాతోనూ హిట్ అందుకున్నాడు అజిత్.ఇందులోనూ త్రిషనే హీరోయిన్ గా నటించడం విశేషం. మొత్తానికి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారంతో అజిత్ అభిమానులు సంతోషంగా తేలియాడుతున్నారు. అయితే కొందరి అత్యుత్సాహంతో ఆయన ఇప్పుడు గాయపడ్డారు. ఏదేమైనా అజిల్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

స్వల్ప గాయమే…

పద్మ భూషణ్ అందుకుంటూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..