AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరంటే..

ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు.

Cinema : హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరంటే..
Cinema
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2026 | 5:33 PM

Share

లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ముహూర్తపు షాట్ కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు.

ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా నిర్మిస్తున్నాం. మా మొదటి ప్రాజెక్ట్ ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ప్రతి యువకుడి మనసుకు దగ్గరయ్యే భావాలు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం ఈ చిత్రంలో ఉంటాయి. మంచి కథకు ప్రాధాన్యం ఇస్తూ, టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. కొత్త ప్రతిభకు అవకాశం ఇవ్వడమే కాకుండా, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ల సహకారంతో ప్రతి ఫ్రేమ్‌ అందంగా కనిపించేలా కృషి చేస్తున్నాం. ఈ చిత్రం నిర్మాతగా తొలి అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరెన్నో మంచి, అర్థవంతమైన చిత్రాలకు పునాది అవుతుందని నమ్ముతున్నాను.

ప్రేక్షకుల ఆశీస్సులు, మీడియా మిత్రుల ప్రోత్సాహం, సినీ పరిశ్రమలోని అందరి సహకారం మా బలం. మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ ప్రయాణం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నాను”అని అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు రఘువర్ధన్ కోట్ల తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us
కావ్యపాపకు షాకిచ్చిన ఛోటా ప్యాకెట్.. నేను ధోనిని కాదంటూ..
కావ్యపాపకు షాకిచ్చిన ఛోటా ప్యాకెట్.. నేను ధోనిని కాదంటూ..
మా నాన్న మరణానికి కరోనా టీకానే కారణం..: షేన్ వార్న్ కుమారుడు..!
మా నాన్న మరణానికి కరోనా టీకానే కారణం..: షేన్ వార్న్ కుమారుడు..!
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!