- Telugu News Photo Gallery Cinema photos Actress Pooja Hegde remembers her grandmother as she wears a 70 year old saree
Pooja Hegde: మేడం సార్.. మేడం అంతే! 70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే.. ఫొటోస్ ఇదిగో
గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాల్లో కనిపించిని పూజా హెగ్డే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం రెట్రో. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మే01న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో చీరతోనే కనిపిస్తోంది బుట్ట బొమ్మ.
Updated on: Apr 29, 2025 | 4:23 PM

సాధారణంగా పూజా హెగ్డే ఎక్కువగా మోడ్రన్, ట్రెండీ దుస్తుల్లోనే దర్శనమిస్తుంది. అయితే ఈ మధ్యన ట్రెడిషినల్ శారీలోనే ఎక్కువగా కనిపిస్తోంది బుట్ట బొమ్మ

గత కొన్ని రోజులుగా రెట్రో సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది పూజ. ఈ సమయాల్లో ఎక్కువగా చీరలోనే కనిపించింది.

తాజాగా మరోసారి ట్రెడిషినిల్ శారీలో తళుక్కుమంది బుట్ట బొమ్మ. అయితే ఈ చీరకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే.. ఇది వాళ్ల అమ్మమ్మ చీర.

తాజాగా ఈ చీరను ధరించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజ 'సుమారు 70 ఏళ్ల కిందటి చీర ఇది. మా బామ్మ ఎంతో ప్రేమతో దీన్ని నాకు ఇచ్చింది'

'ఇది కట్టుకున్న క్షణం మా బామ్మతో నాకున్న అనుబంధం, నా చిన్నప్పటి జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి' అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది పూజ.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 'సో క్యూట్.. మేడమ్ సార్ మేడమ్ అంతే'.. అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు..




