- Telugu News Photo Gallery Cinema photos Do You Know These 5 Horror Movies To Watch On OTT PlatForms and Youtube, Check Here List
Tollywood: వామ్మో.. భయం సైతం భయపడుతుంది ఈ సినిమాలు చూసి.. ఆ ట్విస్టులకు గుండె ఆగిపోద్ది గురూ..
హార్రర్ సినిమాలు చూడడం ఇష్టమా.. ? మీరు హార్రర్ సినీప్రియులా.. ? అయితే ఇప్పుడు మీకోసమే కొన్ని భయానక చిత్రాల గురించి చెప్పబోతున్నాం. ఊహించని ట్విస్టులు.. భయపెట్టే విజువల్స్ ఉండే సినిమాల గురించి ఎప్పుడైనా విన్నారా.. ? ఇక క్లైమాక్స్ గురించి చెప్పక్కర్లేదు. ఒక్కో సినిమా చూస్తే మీ గుండె ఆగిపోద్ది. ఇంతకీ ఈ సినిమాల సంగతి ఏంటంటే..
Updated on: Apr 29, 2025 | 7:11 PM

మొదటి సినిమా ముసల్లత్. ఇది 2007లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 1 గంట 35 నిమిషాలు ఉండే ఈ సినిమా అద్భుతమైన భయానక అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాను మీరు యూట్యూబ్ లోనూ చూడొచ్చు. స్త్రీని ప్రేమిస్తున్న దెయ్యం కథ ఇది. ఆమె కోసమే ఏకంగా మనిషిగా మారాలనే ప్రయత్నాలు చేస్తుంటుంది.

ఆ తర్వాతి చిత్రం మాగీ. 2015లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది న్యూయార్క్ జర్నలిస్ట్ ఒలివియా, ఆమె మార్లా కథను చూపిస్తుంది. ఒలివియా ఏదో పని కోసం టర్కియేకు వెళుతుంది. ఆ సమయంలో ఆమె సోదరి గర్భవతి అని తెలుస్తోంది. పెళ్లి కాకుండానే తన సోదరి ప్రెగ్నెంట్ కావడం.. చివరకు అతడితో విడిపోతుంది. ఇక్కడి నుంచే కథ భయానక మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

2015లో విడుదలైన బాస్కిన్ సినిమా. తెలియకుండానే నరకానికి వెళ్ళే ఐదుగురు పోలీసుల చుట్టూ దీని కథ తిరుగుతుంది. 2013 సంవత్సరంలో అదే కథ ఆధారంగా అదే పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ సైతం వచ్చింది. కెన్ ఎవ్రెనాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

2004లో విడుదలైన 'ఓకుల్' అనే సినిమాను ఇప్పుడు యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇది ఒక పాఠశాల కథను చూపిస్తుంది. అక్కడ ఒక దెయ్యం పిల్లలు, ఉపాధ్యాయుల జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. వారంతా భయాంకరంగా మారేందుకు ప్రయత్నిస్తుంటుంది.

2018లో వచ్చిన బెడ్డువా: ది కర్స్ సినిమా కూడా. ఈ చిత్రం నలుగురు పాఠశాల స్నేహితులు మెలెక్, బుర్కు, ఎడా, అయిలా కథను చెబుతుంది. షమన్ అనే స్త్రీని కలిసినప్పుడు నలుగురి జీవితాలు మారిపోతాయి. వారి జీవితాలు మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.




