AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా చేయండి..!

Broom Vastu tips: ఇంట్లో చీపురు ఉంచే ప్రదేశం, ఉపయోగించే విధానం వాస్తు, శని అనుగ్రహంతో ముడిపడి ఉన్నాయి. శనీశ్వరునికి ప్రియమైన చీపురును ఆగ్నేయ లేదా వాయువ్య మూలల్లో ఉంచాలి. ఈశాన్యం, దేవుడి గది, వంటగదిలో చీపురును పెట్టరాదు. సాయంత్రం ఊడవటం, కాలితో తొక్కటం వంటివి చేయకూడదు. శనివారం చీపురు కొని, రాత్రిపూట గుమ్మానికి అడ్డంగా ఉంచడం శ్రేయస్కరం.

Rajashekher G
|

Updated on: Mar 03, 2026 | 7:43 PM

Share
ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఇంట్లో చీపురును నిత్యం వాడుతారు. అయితే, ఈ చీపురును వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, సరైన పద్ధతిలో ఉంచడం, ఉపయోగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చీపురును శని దేవుని ఆయుధంగా పరిగణిస్తారు. మహాశివుడు శని దేవుడికి అభయం ప్రసాదించాడని, శని త్రయోదశి నాడు పూజించే వారికి, అలాగే శివనామాన్ని జపించే వారికి శని దేవుడు అభయం ఇస్తాడని నమ్మకం. అందుకే, చీపురును పట్టుకున్నప్పుడు "శివాయ నమః" అని జపించి ఇల్లు ఊడిస్తే, శనీశ్వరుడు ఆ ఇంటికి ఎటువంటి కష్టాలు కలిగించడని, అదృష్టాన్ని కలిగిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఇంట్లో చీపురును నిత్యం వాడుతారు. అయితే, ఈ చీపురును వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, సరైన పద్ధతిలో ఉంచడం, ఉపయోగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చీపురును శని దేవుని ఆయుధంగా పరిగణిస్తారు. మహాశివుడు శని దేవుడికి అభయం ప్రసాదించాడని, శని త్రయోదశి నాడు పూజించే వారికి, అలాగే శివనామాన్ని జపించే వారికి శని దేవుడు అభయం ఇస్తాడని నమ్మకం. అందుకే, చీపురును పట్టుకున్నప్పుడు "శివాయ నమః" అని జపించి ఇల్లు ఊడిస్తే, శనీశ్వరుడు ఆ ఇంటికి ఎటువంటి కష్టాలు కలిగించడని, అదృష్టాన్ని కలిగిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

1 / 5

ఈశాన్య మూలకు పొరపాటున కూడా.. 

ఇంట్లో చీపురును ఉంచే ప్రదేశం చాలా ముఖ్యం. చీపురును ఎల్లప్పుడూ ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) లేదా వాయువ్య (నార్త్-వెస్ట్) మూలల్లోని గోడకు మాత్రమే పెట్టాలి. ఈశాన్య మూలకు పొరపాటున కూడా చీపురును పెట్టరాదు. అలాగే, దేవుని గదిలో చీపురును వినియోగించకూడదు. పూజ గదిలో ముగ్గు వేసినా, దాన్ని గుడ్డతో మాత్రమే తుడవాలి కానీ చీపురుతో కాదు. వంటగదిలో కూడా చీపురును ఉంచకూడదు. చీపురును గోడకు పెట్టేటప్పుడు, చేతితో పట్టుకునే వైపును కిందకు పెట్టకూడదు. మనం ఎలా ఊడుస్తామో, అదే విధంగా నిటారుగా ఉంచాలి లేదా పడుకోబెట్టాలి. తలకిందులుగా పెడితే శని దేవుని ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రం చెబుతుంది. శని దేవుడు అలాంటి ఇంటికి బాధలను కలిగిస్తాడని హెచ్చరిస్తుంది.

ఈశాన్య మూలకు పొరపాటున కూడా.. ఇంట్లో చీపురును ఉంచే ప్రదేశం చాలా ముఖ్యం. చీపురును ఎల్లప్పుడూ ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) లేదా వాయువ్య (నార్త్-వెస్ట్) మూలల్లోని గోడకు మాత్రమే పెట్టాలి. ఈశాన్య మూలకు పొరపాటున కూడా చీపురును పెట్టరాదు. అలాగే, దేవుని గదిలో చీపురును వినియోగించకూడదు. పూజ గదిలో ముగ్గు వేసినా, దాన్ని గుడ్డతో మాత్రమే తుడవాలి కానీ చీపురుతో కాదు. వంటగదిలో కూడా చీపురును ఉంచకూడదు. చీపురును గోడకు పెట్టేటప్పుడు, చేతితో పట్టుకునే వైపును కిందకు పెట్టకూడదు. మనం ఎలా ఊడుస్తామో, అదే విధంగా నిటారుగా ఉంచాలి లేదా పడుకోబెట్టాలి. తలకిందులుగా పెడితే శని దేవుని ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రం చెబుతుంది. శని దేవుడు అలాంటి ఇంటికి బాధలను కలిగిస్తాడని హెచ్చరిస్తుంది.

2 / 5

వాటిని ఒకే దగ్గర పెట్టకూడదు.. 

చీపురును ఎవరికీ కనిపించకుండా, మూలన పెట్టాలి. ఇంట్లోకి వచ్చే వ్యక్తులు ముందుగా చీపురును చూడకూడదని శాస్త్రం చెబుతుంది. ఇది ఇంటికి శుభం కాదని నమ్మకం. చీపురుతో గుమ్మంలో చిమ్మే సమయంలో ఈశాన్యం నుండి నైరుతి వైపు చిమ్మి, చెత్తను ఒకచోట చేర్చి, చాటలో ఎత్తి చెత్తకుండీలో పడవేయాలి. అయితే, చీపురు, చాట ఒక దగ్గర పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది, ఎందుకంటే అవి విరోధులుగా భావిస్తారు.

వాటిని ఒకే దగ్గర పెట్టకూడదు.. చీపురును ఎవరికీ కనిపించకుండా, మూలన పెట్టాలి. ఇంట్లోకి వచ్చే వ్యక్తులు ముందుగా చీపురును చూడకూడదని శాస్త్రం చెబుతుంది. ఇది ఇంటికి శుభం కాదని నమ్మకం. చీపురుతో గుమ్మంలో చిమ్మే సమయంలో ఈశాన్యం నుండి నైరుతి వైపు చిమ్మి, చెత్తను ఒకచోట చేర్చి, చాటలో ఎత్తి చెత్తకుండీలో పడవేయాలి. అయితే, చీపురు, చాట ఒక దగ్గర పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది, ఎందుకంటే అవి విరోధులుగా భావిస్తారు.

3 / 5

అలా చేసి లక్ష్మీ ఆగ్రహానికి గురికావొద్దు.. 

చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు చీపురు కొని ఇంటికి తీసుకురాకూడదు. శనివారం రోజు చీపురు కొని ఇంటికి తెచ్చి, అదే రోజు ఒకసారి ఉపయోగించడం శ్రేయస్కరం. వాడి పాడైపోయిన చీపురును ఇంట్లో ఉంచకూడదు, దాన్ని వెంటనే పారవేయాలి. పాడైపోయిన చీపురును ఇంట్లో ఉంచడం దరిద్రానికి సంకేతం. చీపురును కాలితో తొక్కడం అస్సలు చేయకూడదు. కాలితో తొక్కితే శ్రీ మహాలక్ష్మి దేవి ఆగ్రహిస్తుందని నమ్మకం.

అలా చేసి లక్ష్మీ ఆగ్రహానికి గురికావొద్దు.. చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు చీపురు కొని ఇంటికి తీసుకురాకూడదు. శనివారం రోజు చీపురు కొని ఇంటికి తెచ్చి, అదే రోజు ఒకసారి ఉపయోగించడం శ్రేయస్కరం. వాడి పాడైపోయిన చీపురును ఇంట్లో ఉంచకూడదు, దాన్ని వెంటనే పారవేయాలి. పాడైపోయిన చీపురును ఇంట్లో ఉంచడం దరిద్రానికి సంకేతం. చీపురును కాలితో తొక్కడం అస్సలు చేయకూడదు. కాలితో తొక్కితే శ్రీ మహాలక్ష్మి దేవి ఆగ్రహిస్తుందని నమ్మకం.

4 / 5
ఐశ్వర్యం, శుభాలు కలగాలంటే..

రాత్రిపూట చీపురు ఇంటికి రక్షణగా ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా కాపాడుతుందని నమ్మకం. అందుకోసం, రాత్రి పడుకునే ముందు చీపురును గుమ్మానికి అడ్డంగా వేసి ఉదయం తీసివేయాలి. అయితే, ముఖ్యంగా సాయంత్రం దీపాలు వెలిగాక ఇంటిని చిమ్మటం, చెత్త ఎత్తటం అస్సలు చేయకూడదు. ఇది పరమ దరిద్రానికి సంకేతంగా భావిస్తారు. ఈ నియమాలను పాటిస్తే శని దేవుని, మహాశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కలిగి, ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

ఐశ్వర్యం, శుభాలు కలగాలంటే.. రాత్రిపూట చీపురు ఇంటికి రక్షణగా ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా కాపాడుతుందని నమ్మకం. అందుకోసం, రాత్రి పడుకునే ముందు చీపురును గుమ్మానికి అడ్డంగా వేసి ఉదయం తీసివేయాలి. అయితే, ముఖ్యంగా సాయంత్రం దీపాలు వెలిగాక ఇంటిని చిమ్మటం, చెత్త ఎత్తటం అస్సలు చేయకూడదు. ఇది పరమ దరిద్రానికి సంకేతంగా భావిస్తారు. ఈ నియమాలను పాటిస్తే శని దేవుని, మహాశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కలిగి, ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us