శంఖు పూలు గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే ఈ చిట్కాలు పాటించండి

samatha

29 November 2026

Pic credit - Pinterest

శంఖు పువ్వులు శివుడికి చాలా ప్రీతికరమైన పువ్వులు అంటారు. అంతే కాకుండా వీటిని ఎక్కువగా పూజల్లో కూడా ఉపయోగిస్తుంటారు.

శంఖు పూలు

అందుకే చాలా మంది తమ ఇంటి వద్ద శంఖు పూల మొక్కను పెంచుకుంటారు. ఇది ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది.

పూల మొక్క

అయితే కొన్ని సార్లు శంఖు పూల మొక్క ఎక్కువగా పూలను పూయదు. అలాంటి సమయంలో తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట.

పూలు పూయదు

శంఖు పూలు గుత్తులు గుత్తులుగా చెట్టు నిండుగా పూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో చూసేద్దాం.

చిట్కాలు

శంఖు పువ్వు మొక్కకు రోజుకు కనీసం 5-6 గంటలు ఎండ తగలాలి. నీడలో పెడితే మొక్క పొడవుగా పెరుగుతుంది కానీ పూలు పూయవు.

ఎండ ఎక్కువ

శంఖు మొక్కకు నీరు ఎక్కువ అయితే వేర్లు కుళ్లిపోతాయి. మట్టి పూర్తిగా ఆరిన తర్వాతే నీరు పోయాలి. రోజూ కొద్దిగా నీరు చాలు.

తక్కువ నీరు

శంఖు పూలు ఎక్కువగా పూయడానికి ఇదే బెస్ట్ చిట్కా. వారానికి ఒకసారి ఒక గ్లాసు పుల్లటి మజ్జిగలో 4 రెట్లు నీరు కలిపి మొక్క మొదట్లో పోయాలి.

పుల్లటి మజ్జిగ

మొక్కను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. పొడవుగా పెరిగిన తీగను పైన కట్ చేస్తే పక్క నుంచి కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలు వచ్చే కొద్దీ పూలు ఎక్కువగా వస్తాయి.

కత్తిరింపులు