42 ఏళ్ల వయసులో ఇంత అందమా..? త్రిష బ్యూటీ సీక్రెట్స్ ఇవేనట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

02 March 2026

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పేరు మారుమోగుతుంది. అటు విజయ్ దళపతి భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరి విడాకుల వార్తలలో ఇప్పుడు త్రిష పేరు వినిపిస్తుంది. విజయ్ గురించి చెబుతూ తన భర్తకు నటితో ఎఫైర్ ఉందని సంగీత చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

ఈ క్రమంలోనే ఇప్పుడు త్రిష గురించి తెగ సెర్చ్  చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. 

ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ త్రిష అందానికి, ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా. ఆమె యోగా, వ్యాయమాలు చేస్తుందట. 

ప్రతి రోజూ కప్పు గ్రీన్ టీ, లేదా కొన్ని చుక్కల నిమ్మకాయతో కలిపిన వెచ్చని నీటిని తీసుకుంటుంది. అలాగే నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తుంది. అలాగే తగినంత నిద్ర పోవడం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటుంది. ఫ్రీహ్యాండ్ వర్కవుట్స్ చేస్తుందట.

ఎక్కువగా నీరు తాగుతుంది. నిత్యం తన శరీరం హైడ్రేడ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే తన అందం, ఫిట్నెస్ విషయంలో త్రిష ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.

నివేదికల ప్రకారం త్రిష ఆస్తులు రూ.130 కోట్లు ఉన్నట్లు సమాచారం.  ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.