AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కినేని ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు.. ముచ్చటగా మూడోసారి కింగ్ సరసన హాట్ బ్యూటీ

ఇప్పుడు రూట్ మార్చారు. ఇన్ని రోజు లు హీరోగా అదరగొట్టిన నాగ్.. ఇప్పుడు విలన్ అవతారమెత్తారు. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు’ నాగ్. అలాగే ధనుష్ కుబేర సినిమాలోనూ మెప్పించారు.

అక్కినేని ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు.. ముచ్చటగా మూడోసారి కింగ్ సరసన హాట్ బ్యూటీ
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 10:28 AM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. హీరోగా నాగార్జున కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు నాగార్జున. ఇప్పటికే 99 సినిమాలతో అలరించిన నాగార్జున ఇప్పుడు 100వ సినిమాకోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నాగ్. ఇటీవలే నాగ్ రూట్ మార్చి విలన్ రోల్స్ లోనూ కనిపిస్తున్నారు. ఇటీవకే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో విలన్ గా అదరగొట్టారు నాగ్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ నాగ్ మాత్రం ఇరగదీశారనే చెప్పాలి. నిజం చెప్పాలంటే కూలి సినిమా వల్ల నాగ్ క్రేజ్ మరింత పెరిగింది. సినిమా మొత్తం ఆయనే డామినేట్ చేశారు. తమిళ్ ఆడియన్స్ నాగ్ కు ఫిదా అయ్యారు. అప్పుడెప్పుడో వచ్చిన రాక్షసుడు సినిమాలో ఎలా ఉన్నడో ఇప్పుడూ అలానే ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఇది నాగ్ కెరీర్ లో 100వ సినిమా.. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది. నాగార్జున 100వ సినిమాకు లాటరీ కింగ్  అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ్ కోసం రంగంలోకి ఓ  స్టార్ హీరోయిన్ తీసుకురానున్నారని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు నాగార్జున ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు ఉప్పొంగిపోయేవారు. ఆమె ఎవరో కాదు అందాల భామ టబు.. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా టబు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

మొన్నామధ్య అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించింది. ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఆమె పూరిజగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే టబు ఇప్పుడు కింగ్ నాగార్జున సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తుంది. నాగార్జున టబు కలిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే సినిమాలు చేశారు. అలాగే నాగార్జున నటించిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఈ ఇద్దరి జోడీగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నాగ్, టబు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దాదాపు 27ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటించనున్నారు నాగ్. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర