విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 3 లోని భారీ నాగుపాము హడలెత్తించింది. క్వార్టర్ నెంబర్ 439 ఆవరణలో కనిపించిన నాగుపాము మెట్ల కింద తిష్ట వేసి కూర్చుంది. అటుగా వెళ్లిన ఆ క్వార్టర్ లోని వాళ్ళు.. నాగుపామును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో అరుపులు కేకలు పెట్టి పరుగులు తీశారు.