- Telugu News Photo Gallery Cinema photos Sarangapani jathakam actress roopa koduvayur shared her latest photos
రూపా కొడువాయూర్.. ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..
రూపా కొడువాయూర్ .. ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.. ఆమె 2000 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించింది. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన రూపా, కటూరి మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పట్టా పొందింది. ఈ చిన్నది కూచిపూడి , భరతనాట్యంలో శిక్షణ పొందిన నృత్యకారిణి కూడా
Updated on: Apr 29, 2025 | 1:29 PM

రూపా కొడువాయూర్ .. ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.. ఆమె 2000 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించింది. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన రూపా, కటూరి మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పట్టా పొందింది. ఈ చిన్నది కూచిపూడి , భరతనాట్యంలో శిక్షణ పొందిన నృత్యకారిణి కూడా

రూపా తన నటనా ప్రస్థానాన్ని 2020లో "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" చిత్రంతో ప్రారంభించింది, ఈ చిత్రంలో ఆమె నటనకు సైమా అవార్డు - ఉత్తమ మహిళా అరంగేట్రం అందుకుంది. ఈ చిత్రం ఆమెకు విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందించింది.

ఆ తర్వాత ఆమె "మిస్టర్ ప్రెగ్నెంట్" చిత్రంలో నటించి మరింత గుర్తింపు పొందింది. ఇటీవల, ఆమె ప్రియదర్శితో కలిసి "సారంగపాణి జాతకం" చిత్రంలో నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందింది.

నటనతో పాటు, రూపా ఫ్యాషన్‌లో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఆకట్టుకునే ఫ్యాషన్ లుక్స్‌ను పంచుకుంటుంది, ఇందులో ధోతీ శారీ, నెటెడ్ శారీలు, ఫ్రిల్‌డ్ టాప్‌లు వంటివి ఉన్నాయి.

ఆమె తన సహజమైన అందం మరియు అభినయంతో తెలుగు చిత్రసీమలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో రూప గురించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా "సారంగపాణి జాతకం" చిత్ర విజయం తర్వాత ఆమె శ్రీలీలాకు పోటీగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.