AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఫ్రీ అయిపోవచ్చు!

అప్పులు ఎక్కువైతే ఆర్థిక ఒత్తిడి తప్పదు. కానీ సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో వాటిని వేగంగా తగ్గించుకోవచ్చు. ఆర్థిక నిపుణుల సూచనల మేరకు ఖర్చుల నియంత్రణ, అదనపు ఆదాయం, రుణ పునర్నిర్మాణం వంటి ఐదు కీలక చిట్కాలను పాటిస్తే ఎంతటి అప్పునైనా సులభంగా తీర్చవచ్చు.

SN Pasha
|

Updated on: Mar 02, 2026 | 6:00 AM

Share
అప్పులు ఎక్కువైపోతే నెలవారీ ఆదాయం ఎంత ఉన్నా ఒత్తిడి పెరుగుతుంది. అయితే సరైన వ్యూహంతో ముందుకు వెళితే అప్పులను వేగంగా తగ్గించుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ ఈ మూడు ఉంటే అప్పుల నుంచి బయటపడటం కష్టం కాదు. మరీ ముఖ్యంగా ఈ 5 టిప్స్‌ పాటిస్తే మాత్రం మీకు ఎంత అప్పు ఉన్నా తీర్చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
అన్ని అప్పుల జాబితా తయారు చేయండి.. మొదట మీరు ఎంత మొత్తం ఎవరికి బాకీ ఉన్నారో స్పష్టంగా రాసుకోండి. ప్రతి లోన్‌కు వడ్డీ రేటు, EMI, మిగిలిన కాలం వంటి వివరాలు నమోదు చేయండి. ఇది మొత్తం పరిస్థితి మీకు స్పష్టంగా కనిపించడానికి సహాయపడుతుంది. అంధంగా చెల్లింపులు చేయడం కంటే స్పష్టమైన జాబితా ఉంటే ప్రాధాన్యత క్రమం నిర్ణయించడం సులభం.

2 / 6
ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తీర్చండి.. క్రెడిట్ కార్డ్ బాకీలు లేదా అధిక వడ్డీ ఉన్న వ్యక్తిగత రుణాలు మీపై ఎక్కువ భారాన్ని పెడతాయి. కాబట్టి హై ఇంటరెస్ట్ ఫస్ట్ వ్యూహాన్ని పాటించండి. ఈ విధానం పాటిస్తే మొత్తం వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది, అప్పు త్వరగా ముగుస్తుంది.

3 / 6
అనవసర ఖర్చులను కట్టడి చేయండి.. కొన్ని నెలలు కట్టుదిట్టమైన బడ్జెట్ అమలు చేయడం ద్వారా అదనపు డబ్బును అప్పు తీర్చడానికి మళ్లించండి. బయట తినడం, అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లు, విలాస ఖర్చులు తగ్గిస్తే నెలకు మంచి మొత్తాన్ని సేవ్ చేయవచ్చు. చిన్న చిన్న పొదుపులు కూడా అప్పు తగ్గించడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి.

4 / 6
అదనపు ఆదాయం మార్గాలు వెతకండి.. సైడ్ ఇన్‌కమ్ అప్పు తీర్చడాన్ని వేగవంతం చేస్తుంది. ఫ్రీలాన్సింగ్, పార్ట్‌టైమ్ పని, ఆన్‌లైన్ సేవలు లేదా మీ నైపుణ్యానికి సరిపోయే చిన్న వ్యాపారం ద్వారా వచ్చే అదనపు డబ్బును నేరుగా లోన్ ప్రీపేమెంట్‌కు వినియోగించండి. EMIతో పాటు ఎక్స్‌ట్రా చెల్లింపులు చేస్తే కాలం గణనీయంగా తగ్గుతుంది.

5 / 6
లోన్ రీస్ట్రక్చరింగ్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పరిశీలించండి.. వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ ఉన్న లోన్‌కు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా బ్యాంకుతో రీస్ట్రక్చరింగ్ మాట్లాడటం మంచిది. ఇది EMI భారాన్ని తగ్గించి మొత్తం చెల్లింపు వేగాన్ని పెంచుతుంది.

6 / 6
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్