AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Phani CH
|

Updated on: Mar 02, 2026 | 10:49 AM

Share

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది.

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. బాబా వంగా తన అంచనాలలో 2026వ సంవత్సరాన్ని అత్యంత ప్రమాదకరమైన ఏడుగా అన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉంటుందని ఆమె అప్పట్లోనే చెప్పారు. ముఖ్యంగా 2026 ప్రారంభంలోనే ఒక Great War మొదలవుతుందని ఆమె జోస్యం చెప్పారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ పరిణామాలు ఆమె చెప్పిన యుద్ధ సూచనలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో సంభవిస్తుందని ఆమె హెచ్చరించారు.. బాబా వంగా భవిష్యవాణి ప్రకారం, ఈ మహా యుద్ధం తొలుత తూర్పు దేశాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాలకు విస్తరిస్తుంది. దీనివల్ల పశ్చిమ దేశాలకు అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా యూరప్ ఖండం ఈ యుద్ధం వల్ల అతలాకుతలం అవుతుందని, కొన్ని దేశాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా బలహీనపడతాయని అంచనా వేశారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న అధికార సమతుల్యత పూర్తిగా మారిపోతుందని బాబా వంగా వివరించారు. యూరప్ వినాశనం తర్వాత ప్రపంచ రాజకీయ పటంలో పెద్ద మార్పులు వస్తాయని బాబా వంగా చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల అనంతరం రష్యా ఒక గ్లోబల్ పవర్‌గా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు. రష్యా మరింత బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అధికార కేంద్రాలు మారిపోతాయని ఆమె మాటల సారాంశం. అయితే, బాబా వంగా చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు తరతరాలుగా ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. 1911లో జన్మించిన బాబా వంగా ను ‘బాల్కన్ నాస్ట్రడామస్’ అని పిలుస్తారు. చిన్నతనంలోనే ఒక పెద్ద తుపానులో చిక్కుకుని ఆమె తన కంటి చూపును కోల్పోయారు. అయితే, చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే దివ్యశక్తి లభించిందని ఆమెను నమ్మే వారు చెబుతుంటారు. ఆమె చేసిన ఎన్నో అంచనాలు గతంలో నిజమయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆమె 2026 గురించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు భయం పుట్టిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..

Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు

US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌

Follow Us