- Telugu News Photo Gallery Cricket photos Team India Former Cricketer Sreesanth Visits Tirumala Srivari Temple, See Photos
Sreesanth: తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. భార్యాబిడ్డలతో కలిసి స్వామివారికి మొక్కులు.. ఫొటోస్
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. అతను తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 29) ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు.
Updated on: Apr 29, 2025 | 5:03 PM

టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పొల్గొన్నాడు శ్రీశాంత్.

ఈ సందర్భంగా ఆలయంలోని వేద పండితులు శ్రీశాంత్ కుటుంబ సభ్యులకు వేదశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అలాగే పట్టు వస్త్రాలతో శ్రీశాంత్ దంపతులను సత్కరించారు. ఇక దర్శనానంతరం బయటకు వచ్చిన శ్రీశాంత్ తో ఫొటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.

ఇక ఆలయం వెలుపల శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ… కుటుంబ సభ్యులతో . శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

ఇక ఐపీఎల్-2025పై స్పందిస్తూ చిన్న వయస్సులో వైభవ్ సూర్య వంశి అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని ప్రశంసలు కురిపించాడు. కామెంట్రీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు శ్రీశాంత్.




