- Telugu News Sports News Cricket news Delhi Capitals player Karun Nair ducks Mumbai Indian may become IPL 2025 Champion check full details
ఆ ప్లేయర్ డకౌట్‌తో ఐపీఎల్ 2025 ఛాంపియన్ డిసైడ్.. ఈ హిస్టరీ చూస్తే కోహ్లీకి కన్నీళ్లే భయ్యో
IPL 2025 Winner: ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది. టాప్ 4 చేరుకోవాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మే 25 కంటే ముందే ఐపీఎల్ విన్నర్ ఎవరో తెలిస్తే ఎలా ఉంటుంది.
Updated on: Apr 30, 2025 | 1:30 PM

మే 25 అంటే IPL 2025 ఫైనల్ రోజు. ఐపీఎల్‌లో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఘర్షణ జరిగే రోజు. ఆపై వాటిలో ఓ జట్టు ఛాంపియన్‌గా మారుతుంది. ఇప్పుడు ఫైనల్ ఆడే మరో జట్టు ఎవరో తెలియదు. కానీ, రెండో జట్టును ఓడించి ఛాంపియన్ అయ్యే జట్టు పేరు ఏదో తెలిసిపోయింది. ఏప్రిల్ 16నే ఆ పేరు ఖారరైందన్నమాట. ఇది మేం చెప్పింది కాదండోయ్. ఐపీఎల్ హిస్టరీనే దీనిని చెబుతోంది. అందుకు సంబంధించిన గణాంకాలు ఓసారి చూస్తే, అసలు మ్యాటర్ ఏంటో తెలిసిపోతుంది.

ఏప్రిల్ 16న ఐపీఎల్ 2025 ఛాంపియన్ జట్టును నిర్ణయించిన బ్యాటర్ పేరు కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. అయితే, ఈ జట్టు ఈసారి IPL ఛాంపియన్‌గా అవుతుందా? లేదా అనేది చూడాలి.

ఛాంపియన్ జట్టు జాతకం కరుణ్ నాయర్ స్కోర్‌పై ఆధారపడి ఉంది. కరుణ్ నాయర్ జీరోకే అవుట్ అవ్వడంతో ముడిపడి ఉందన్నమాట. కరుణ్ నాయర్ సున్నా పరుగులకే ఔటైనప్పుడల్లా, ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్లుగా నిలిచిందని ఐపీఎల్ చరిత్ర నిరూపిస్తుంది.

IPL 2025లో, ఏప్రిల్ 16న కరుణ్ నాయర్ సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఆ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 3 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవలేకపోయాడు.

2013, 2017, 2020 ఐపీఎల్‌లలో, కరుణ్ నాయర్ కూడా ఇదే విధంగా ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేకపోయాడు. మరి అందులో ఏ జట్టు ఛాంపియన్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపీఎల్ 2025 లో కూడా ముంబై ఇండియన్స్ ఛాంపియన్ జట్టుగా నిలుస్తుందని హిస్టరీ చెబుతోంది. మరి అందుకోసం వేచిచూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



















