March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వారికి అడ్డు కట్ట పడినట్లే
వాట్సప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మార్చి 1 నుంచి కొత్త సిమ్ బైండింగ్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఫోన్‌లో సిమ్ లేకుండా ఈ యాప్‌లు పనిచేయవు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వెబ్ వెర్షన్ ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. మొబైల్ సిమ్ ద్వారా తిరిగి లాగిన్ అవ్వాలి. గడువు పెంపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
వాట్సప్, టెలిగ్రామ్ లొ సిమ్ బైండింగ్ రూల్స్ మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏంటి ఈ సిమ్ బైండింగ్ అంటే సిమ్ లేకుండా ఇకపై ఆ యాప్స్ ఫోన్‌లో పనిచేయవన్నమాట. ఎవరైనా సిమ్ లేకుండా వాట్సప్ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్ నిలిచిపోతుంది. వాట్సప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై యాప్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్స్‌కు సిమ్ కార్డు బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం డాట్ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌లో సిమ్‌కార్డు లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ఆ యాప్‌లను వెబ్‌బ్రౌజర్‌లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. మళ్లీ సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ సిమ్‌తో లాగిన్ అవ్వాలి. ప్రస్తుతం యాప్ ఇన్‌స్టలేషన్ సమయంలోనే సిమ్‌కార్డును ధ్రువీకరించుకుంటున్నారు. ఆ తర్వాత డివైజ్ నుంచి సిమ్‌కార్డును తొలగించినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్‌ను వినియోగించుకోవడం సాధ్యమవుతోంది. సిమ్ బైండింగ్ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు అంటున్నారు. సిమ్ బైండింగ్ రూల్స్ అమలు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో మార్చి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు
US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా
Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??
Kodali Nani: రెడ్ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..
Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

