ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ జంట విడిపోయింది. నవ వధువు తన ప్రేమ విషయం చెప్పి, తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని ఆరోపించింది. భర్తతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పడంతో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాయి. కౌన్సెలింగ్ విఫలమవడంతో వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. ఇది బలవంతపు వివాహాల పరిణామాలకు ఉదాహరణ.
పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. చివరకు ఆ జంట వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. అనంతరం నవ వధువు మిథిలేష్ కుమారి.. అత్తగారింటికి వెళ్లింది. అయితే తొలి రాత్రి నాడే.. భర్తతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు కొట్టి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. ఇది విని ధరమ్ సింగ్ కుష్వాహా, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికి ముందే వధువు ఈ విషయం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ధరమ్ సింగ్ కుష్వాహా వాపోయాడు. అప్పుడు తమ ఇద్దరికి పెళ్లి జరిగేది కాదని, రెండు కుటుంబాలు ఈ అవమానాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఈ విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. హమీర్‌పూర్‌లోని రాత్ పోలీస్ స్టేషన్‌కు ఇరు కుటుంబాలు చేరుకుని ఫిర్యాదు చేశాయి. పెళ్లైన కొత్త జంటకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించారు. అయితే వివాహాన్ని కొనసాగించేందుకు మిథిలేష్ కుమారి అంగీకరించలేదు. విడిపోయేందుకు ఇరు కుటుంబాలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. దీంతో వెంటనే విడాకులు తీసుకోవాలని ఆ జంట నిర్ణయించింది. అనంతరం మిథిలేష్ కుమారి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
West Asia War: యుద్ధంపై భారత్ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వారికి అడ్డు కట్ట పడినట్లే
Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు
US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా
Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత

