వామ్మో.. ఇదేం మ్యాచ్ భయ్యా.. IND vs WI మ్యాచ్‌లో ఏకంగా 13 భారీ రికార్డులు.. లిస్ట్ చూస్తే పరేషానే..!
IND vs WI Records: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన హై ఓల్టేజ్ పోరులో భారీ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు సెమీస్‌లో చోటు దక్కించుకుంది. ఈక్రమంలో ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులను ఓసారి చూద్దాం..

IND vs WI Stats: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా భారత్–వెస్టిండీస్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచకప్ పోరులో పరుగుల వర్షం కురిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
అదే లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ 5 వికెట్ల నష్టానికి విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. మ్యాచ్‌లో కేవలం పరుగులే కాకుండా రికార్డుల వర్షం కూడా కురిసింది. ఆ 13 కీలక రికార్డులు ఇవే:
IND vs WI మ్యాచ్‌లో నమోదైన 13 భారీ రికార్డులు..
1. పవర్‌ప్లే స్వింగ్ ప్రత్యేకత..
ఈ వరల్డ్‌కప్‌లో పవర్‌ప్లేలో సీమర్లు సగటున 1 డిగ్రీకిపైగా స్వింగ్ సాధించిన ఏకైక వేదిక ఇదే. ఇదే ఇక్కడ జరిగిన తొలి నైట్ మ్యాచ్ కూడా.
2. భారత్‌పై తొలి 50+ ఓపెనింగ్ భాగస్వామ్యం..
ఈ టోర్నీలో భారత్‌పై వెస్టిండీస్ తొలి 50కిపైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
3. వరుణ్ చక్రవర్తి ప్రభావం..
వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఎడెన్ గార్డెన్స్‌లో బాగా రాణిస్తుంటాడు. ఈ మ్యాచ్‌లో కూడా కీలక భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.
4. షాయ్ హోప్ డాట్ బాల్స్ రికార్డు..
షాయ్ హోప్ (Shai Hope) 33 బంతుల్లో 17 డాట్ బాల్స్ ఎదుర్కొన్నాడు (51.5%). T20 WC 2026లో 30+ బంతులు ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇది అత్యధికం.
5. వెస్టిండీస్ 70వ సిక్స్..
ఈ టోర్నీలో వెస్టిండీస్ 70వ సిక్స్ నమోదు చేసింది – ఒక T20I సిరీస్‌లో ఫుల్ మెంబర్ జట్టుకి ఇది రికార్డు.
6. ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు..
19* – షిమ్రాన్ హిట్ మేయర్ (Shimron Hetmyer) (2026)
18 – ఫర్హాన్ (Sahibzada Farhan) (2026)
17 – నికోలస్ పూరన్ (Nicholas Pooran) (2024)
16 – క్రిస్ గేల్ (Chris Gayle) (2012)
16 – గుర్భాజ్ (Rahmanullah Gurbaz) (2024)
7. హెట్‌మేయర్ vs బుమ్రా (T20ల్లో)..
Jasprit Bumrah బౌలింగ్‌లో హెట్‌మేయర్ 8 ఇన్నింగ్స్‌లో 23 బంతులు ఎదుర్కొని 15 పరుగులు మాత్రమే చేశాడు, 6 సార్లు అవుట్ అయ్యాడు.
8. భారత్ ఫీల్డింగ్ నిరాశ..
ఈ వరల్డ్‌కప్‌లో భారత్ 13 క్యాచ్‌లు వదిలింది. క్యాచింగ్ ఎఫిషియెన్సీ 71.7% – సూపర్ 8 జట్లలో అత్యల్పం.
9. T20Iలో వెస్టిండీస్‌కు అత్యధిక సిక్సర్లు..
150 – రోహన్ పావెల్ (Rovman Powell)
149 – నికోలస్ పూరన్
136 – ఇవిన్ లెవిస్ (Evin Lewis)
124 – క్రిస్ గేల్
99 – కిరాన్ పోలార్డ్ (Kieron Pollard) / శిమ్రోన్ హెట్‌మేయర్
10. ఒక T20I సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు (జట్టు)..
78 – బల్గేరియా vs జిబ్రాల్టర్, టర్కీ (2025)
76 – వెస్టిండీస్ (T20 WC 2026)
69 – భారత్ vs న్యూజిలాండ్ (2026)
11. బుమ్రాకు ఖరీదైన స్పెల్..
బుమ్రా ఇచ్చిన 36 పరుగులు T20 వరల్డ్‌కప్‌లో అతని రెండో అత్యధికం. 2016లో వాంఖడేలో 42 పరుగులు ఇచ్చాడు.
12. హోల్డర్ vs సామ్‌సన్ (T20)..
హోల్డర్ (Jason Holder) బౌలింగ్‌లో సంజూ శాంసన్ 52 బంతుల్లో 57 పరుగులు, 4 సార్లు అవుట్. సగటు 14.25.
13. సంజూ సామ్‌సన్ చరిత్రాత్మక 97*..
సంజూ శాంసన్ (Sanju Samson) 97* పరుగులు చేసి టీ20 వరల్డ్‌కప్‌లో రన్ చేజ్‌లో భారత్ తరపున అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉండేది (82* vs ఆస్ట్రేలియా 2016, 82* vs పాకిస్థాన్ 2022).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
