NBK111 ఎవరితో.. హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయలో బాలకృష్ణను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?
నందమూరి నటసింహం బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తే ఆ ఊపే వేరు. ప్రస్తుతం చిన్న విరామంలో ఉన్న ఆయన, త్వరలోనే మేకోవర్ మార్చేసి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా క్యూ కడుతున్నారు.

ఆయన డైలాగ్ చెబితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఆయన తొడకొడితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న ఆ అగ్ర హీరో, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతుండగా, మరోవైపు ఇండస్ట్రీలోని యంగ్ అండ్ మాస్ డైరెక్టర్లు ఆయన కోసం పవర్ ఫుల్ కథలు సిద్ధం చేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తే ఆ ఊపే వేరు. ప్రస్తుతం చిన్న విరామంలో ఉన్న ఆయన, త్వరలోనే మేకోవర్ మార్చేసి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా క్యూ కడుతున్నారు. మాస్ మసాలా కథల నుండి ప్రయోగాత్మక చిత్రాల వరకు ఆయన ముందు ఇప్పుడు బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి. వచ్చే రెండేళ్ల వరకు డైరీ ఫుల్ అయ్యేలా కనిపిస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్టుల విశేషాలేంటో చూద్దాం..
NBK111..
బాలకృష్ణ తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఈ నెలలో పట్టాలెక్కించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు టార్గెట్ పెట్టుకున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయి.
లైన్ లో ఉన్నారా?
2027 సంక్రాంతి రేసును కూడా బాలయ్య ఇప్పుడే టార్గెట్ చేశారు. NBK112 కోసం ఆయన ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక పక్కా కమర్షియల్ కథను ఆయనకు వినిపించారు. ఈ సినిమాను నాగ వంశీ నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, హరీష్ శంకర్ తర్వాతి సినిమా ఫలితంపైనే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని టాక్. మరోవైపు ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ కూడా బాలయ్యకు ఒక విభిన్నమైన కథను వినిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉంది.

Vivek Athreya & Bala Krishna
ఆదిత్య 999..
ఇక నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘ఆదిత్య 999’. దీనిపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటికే వర్క్ చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీరు కాకుండా దిల్ రాజు కూడా రెండు మూడు వైవిధ్యమైన కథలను బాలయ్య ముందు ఉంచారు. ఇన్ని ఆప్షన్లు ఉన్నా, ఆయన మాత్రం ఇంకా దేనికీ అధికారికంగా సైన్ చేయలేదు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్స్ నుండి కంటెంట్ ఓరియెంటెడ్ కథల వరకు బాలయ్య ఇప్పుడు విభిన్న జానర్లను పరిశీలిస్తున్నారు. ఈ సమ్మర్ కల్లా ఆయన అడుగు ఏ దిశగా పడుతుందో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
