Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??
విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 'విరోష్' జోడి ధరించిన సుమారు 7 కోట్ల విలువైన 3 కిలోల బంగారు ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ 10 నెలల పాటు శ్రమించి, దక్షిణ భారత ఆలయ, రాజవంశీయుల సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ నక్షీ, రవ పనితనం గల డిజైన్‌లను రూపొందించింది. వధువు, వరుడు ధరించిన ప్రత్యేక ఆభరణాల వివరాలు ఇక్కడ చూడండి.
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. కెరీర్ బిగినింగ్‌లో.. సిల్వర్ స్క్రీన్ పై ప్రేమ పాత్రలు పోషించిన వీరిద్దరూ.. రియల్ లైఫ్‌లోనూ ఆ పాత్రలను కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా మారిపోయారు. ‘కడ వరకు కలిసి నిలిచే..’ అంటూ తమ జర్నీని మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు విరోష్ జోడీ. అయితే ఆ ఫోటోల్లో.. అందరి కళ్లూ విజయ్, రష్మిక ధరించిన బంగారు ఆభరణాల మీదే ఉన్నాయి. వీరిద్దరూ ధరిచిన ఆభరణాల విలువ, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ, రష్మిక ధరించిన నగలను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ రూపొందించింది. ఇందుకోసం సదరు సంస్థ దాదాపు 10 నెలల టైం తీసుకుని మరీ.. వినూత్నంగా.. రాజసం ఉట్టిపడేలా డిజైన్ చేసింది. ఇక కొన్ని రిపోర్ట్స్ ప్రకారం విరోష్ జోడీ.. దాదాపు 3 కిలోల ఆభరణాలను ధరించారు. వీటి మొత్తం విలువ దాదాపు 7 కోట్లకు పైనే ఉంటుందని అంచనా..ఈ ఆభరణాలు.. దక్షిణ భారత ఆలయ వాస్, రాజవంశాల వారసత్వాన్ని ప్రతిబింబించేలా నక్షీ, రవ పనితనంతో రూపొందించారని తెలుస్తోంది. ఇక వెడ్డింగ్ ఆఫ్ విరోష్ లో.. వధువు రష్మిక మందన్న.. మొత్తం 11 రకాల బంగారు ఆభరణాలను ధరించారు. అందులో మెడకు చోకర్, దానితో పాటు పొడవైన హారాలు, కాసుల పేరు వేసుకున్నారు. నుదుటిపై మాంగ్ టిక్కా, జడకు అలంకారంగా.. బంగారు జడ బిళ్లలను ధరించారు. వీటితో పాటే చెవులకు భారీ ఝుంకాలు, వడ్డాణం, అరవంకీలు, కాళ్ల పట్టీలు, చేతులకు హాత్ పూల్ నూ ధరించారు. రష్మిక వేసుకున్న ఆభరణాలన్నింటిలో వజ్రాలు కానీ పగడాలు కానీ కనపడవు. పూర్తిగా బంగారంతో చేసిన వాటినే ఎంచుకున్నారు. వరుడు విజయ్ దేవరకొండ కూడా … తాను ధరించే బంగారు ఆభరణాలు అందరి కంటే భిన్నంగా ఉండేలా చూసుకున్నాడు. సుమారు రాజసం ఉట్టిపడే 8 రకాల ఆభరణాలను తన పెళ్లిలో విజయ్ ధరించాడు. ఏనుగు, పులి మొటిఫ్స్‌తో కూడిన భారీ టెంపుల్ నెక్లెస్.. దాంతో పాటే కాసుల పేరు కూడా వీటిలో ఉన్నాయి. అంతేకాదు తన ధోతీపై బంగారు వడ్డాణాన్ని కూడా విజయ్ వేసుకున్నాడు. రాజవంశీయుల పెళ్లిలో.. ఒకప్పుడు అందరూ ధరించే కడుక్కన్ చెవి రింగులను కూడా కనిపిస్తాయి. వీటితో పాటే ముత్యాలు, వజ్రాలు పొదిగిన హారాలు, బంగారు కడాలను కూడా విజయ్ తన పెళ్లిలో ధరించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..
Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..
Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్ మీడియాలో రికార్డ్ బద్దలు!
రీల్ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్ నోటీసులు..
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..
రీల్ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్ నోటీసులు..
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్

