AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika-Vijay Marriage: 'విరోష్' సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!

Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!

Phani CH
|

Updated on: Mar 02, 2026 | 12:00 PM

Share

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో చరిత్ర సృష్టించాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, కేవలం 14 గంటల్లోనే 23.3 మిలియన్లకు పైగా లైకులతో భారతీయ సెలబ్రిటీల రికార్డులను బద్దలుకొట్టింది. ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత ఒక్కటైన 'విరోష్' జంటకు ప్రధాని, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట వివాహ ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో లైకుల వర్షం కురుస్తోంది. ఈ పోస్ట్ కేవలం 24 గంటల్లోనే భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసి, సోషల్ మీడియాలో వారికున్న అసాధారణమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఇప్పటివరకు బాలీవుడ్ జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫొటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే అత్యధిక రికార్డుగా ఉండేది. అయితే, విజయ్-రష్మిక ‘విరోష్’ జంట ఈ మైలురాయిని కేవలం 14 గంటల్లోనే దాటేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరి పోస్ట్ 23.3 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతోంది. దీంతో అలియా భట్-రణబీర్ కపూర్ (13 మిలియన్+), సమంత-నాగ చైతన్య (12 మిలియన్+), కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (10 మిలియన్+), దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ (8 మిలియన్+) వంటి స్టార్ కపుల్స్ రికార్డులను ఈ జంట అధిగమించింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విరాట్ కోహ్లీ వ్యక్తిగత పోస్ట్ రికార్డుకు కూడా చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. గీత గోవిందం సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి మొదలైన వీరి ప్రయాణం, నేడు ఇలా పెళ్లి పీటల వరకు చేరడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. పెళ్లి ఫోటోలు చూసి మురిసిపోతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల రహస్య ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఒక్కటైన ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నాను” అని విజయ్, “నాకు నిజమైన ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి” అని రష్మిక పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్లు నెటిజన్లను మరింతగా ఆకట్టుకున్నాయి. వీరి పెళ్లి ఫొటోలు టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాస్తూ వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయ్‌పూర్ వేడుకల అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు

Published on: Mar 02, 2026 11:58 AM
Follow Us