Lavanya Tripathi: ‘చాలా బాధేస్తోంది’.. యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో వైరల్
మెగా కోడలు, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో వివాహమయ్యాక ఓ వెబ్ సిరీస్ లో నటించిన ఈ అందాల తార ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో యాక్ట్ చేస్తోంది.

టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల తార షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ లావణ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనక పాకిస్తాన్ హస్తముందని తేలడంతో అందరూ దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా చోట్ల ప్రజలు పాకిస్తాన్ జాతీయ జెండాలని రోడ్లపై అంటించి వాటిని కాళ్లతో తొక్కుతూ తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి మాత్రం వింతగా ప్రవర్తించింది.
రోడ్డుపై అంటించి ఉన్న పాకిస్తాన్ జెండాలను అందరు కాళ్లతో తొక్కుకుంటూ వెళుతుంటే సదరు మహిళ మాత్రం తొక్కకుండా అడ్డుకుంది. దీంతో స్థానికులు ఆ యువతిపై మండి పడ్డారు. పాకిస్తాన్ జెండాని రోడ్డుపై నుండి ఎందుకు తీసేస్తున్నావ్. తిరిగి అంటించమని చెబితే ససేమిరా అంది. నువ్వు పాకిస్తాన్ సపోర్టర్‌నా, ఎందుకు జెండాని రోడ్డుపై నుండి తీసేసావు అని స్థానికులు గట్టిగా మందలించినా ఆమె వెనక్కు తగ్గలేదు. ఇదే సమయంలో కొందరు ఆమె వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు.
లావణ్య షేర్ చేసిన పోస్ట్..
While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it. It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025
ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. ఒక వైపు దేశాన్ని రక్షించేందుకు సైనికులు ప్రాణాలకు తెగిస్తుంటే, మరో వైపు సైనికులకు ప్రజలకు హాని చేసే వారికి ఇలాంటి వాళ్లు మద్దతు తెలుపుతుండడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు దేశంలోపల నుండే క్లీనింగ్ మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ లావణ్య త్రిపాఠి సదరు యువతి బాగా సీరియస్ అయింది. మొత్తానికి ఈ వీడియోతో పాటు ఇప్పుడు లావణ్య పోస్ట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








