ఇరాన్ నుండి భారత్ ఏం కొంటుంది? ఏం అమ్ముతుంది? ఇజ్రాయెల్ దాడి ఎఫెక్ట్ ప్రభావం ఎంత
పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంధన సరఫరా, ధరలు, వాణిజ్య మార్గాలు, స్టాక్ మార్కెట్లు, ఎగుమతులు దెబ్బతింటున్నాయి. హార్ముజ్ జలసంధి అంతరాయాలు భారత్ ఇంధన భద్రతకు ముప్పుగా మారాయి. ముడిచమురు ధరల పెరుగుదల దేశీయ ఇంధన ధరలను పెంచి, వినియోగదారుల ఖర్చులను పెంచుతుంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, వాణిజ్య సంబంధాలు, ముఖ్యంగా ఇండియాపై ప్రత్తేక ప్రభావం చూపుతున్నాయి. ఈ సంఘటన గత కొన్ని నెలలుగా భారతదేశం వాణిజ్య పరమైన లావాదేవీలు, ఇంధన సరఫరా, ధరలపై ఆందోళనల్ని పెంచింది. భారతదేశం ప్రపంచంలోని 3వ పెద్ద చమురు దిగుమతి దేశం కావడంతో, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాలపై చిక్కులు పెరిగితే నేరుగా భారత్‌లో ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరా పెద్ద మొత్తంలో వెళ్తుంది. కాబట్టి, ఇక్కడ ఎదురయ్యే అంతరాయం భారత చమురు దిగుమతులపై కూడా ప్రభావం చూపవచ్చు అంటున్నారు నిపుణులు.
ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం తీవ్రత పెరిగితే ముడి చమురు ధరలు ఇప్పటికే పెరిగినట్లు మార్కెట్ సూచకాలు, నిపుణుల అంచనాలు సూచిస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరలపై ఒత్తిడి పెడుతుంది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలుదారుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఆందోళనకారంగా దిగజారినట్లు సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆయిల్, గ్యాస్ సూచీలు కోల్పోయాయి. ఇది చమురు రంగంపై యుద్ధ ప్రభావం స్పష్టంగా చూపుతోంది.
ఇంధన సరఫరాపై మాత్రమే కాదు, వాణిజ్య మార్గాల్లో రవాణా-షిప్పింగ్ రవాణాకు కూడా అంతరాయం ముఖ్యమైన సమస్యగా మారింది. అదే యుద్ధ పరిస్థితులు కొనసాగితే, ప్రధాన మార్గాల్లో బీమా ఖర్చులు, షిప్పింగ్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం అంతర్జాతీయ సరుకు సరఫరాపై కూడా ప్రభావం చూపుతాయి.
భారత ప్రభుత్వాలు పరిస్థితిని గంభీరంగా పరిశీలిస్తూ, శాంతి నిర్వహణ కోసం సంబంధిత దేశాలతో మాటాడుతున్నప్పటికీ ప్రస్తుతానికి పెద్ద ఎత్తున యుద్ధ ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను అదుపులో ఉంచడానికి కూడా మార్గాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా ఇంధన భద్రతను కాపాడటానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు, దేశీయ నిల్వలను ఉపయోగించడం వంటి వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఇలా ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ పరిణామాలు భారతదేశ వాణిజ్యం, ఇంధన దిగుమతులు-ఎగుమతులు, ధరలపై విస్తృత ప్రభావాలను చూపుతున్నాయి. ఇది విదేశీ ఆరోపణలు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, సమగ్ర ఆర్థిక వ్యవస్థపై పెద్ద సందేహాలను సృష్టిస్తోంది.
భారతదేశం ఇరాన్‌కు ఏం ఎగుమతి చేస్తుంది?
భారతదేశం ఎగుమతులలో ఇరాన్‌కు బాస్మతి బియ్యం, టీ, చక్కెర, తాజా పండ్లు, మందులు/ఔషధాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు ఒక లక్ష టన్నుల బియ్యం ఓడలలో నిలిచిపోయిందని సమాచారం. ఇది భారత బియ్యం ఎగుమతుల భారీ భాగాన్ని కలిగి ఉండడంతో వ్యవసాయ-వ్యాపార రంగాలపై నష్టాలు ఏర్పడుతున్నాయి.
భారతదేశం ఇరాన్ నుండి ఏం కొంటుంది?
ఇరాన్ భారతదేశానికి ప్రధాన దిగుమతులలో ఆపిల్, పిస్తాపప్పులు, ఖర్జూరాలు, కివీలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతలు ఇజ్రాయెల్‌తో వాణిజ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. గత పదేళ్లలో ఇజ్రాయెల్‌కు భారతదేశం ఎగుమతులు 21 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




