OTT Movie: చనిపోయిన వాళ్లంతా ఒక్కసారిగా తిరిగి వస్తే.. ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు
ఓటీటీలో ఇప్పుడు క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. ఎక్కువ మంది ఆడియెన్స్ వీటిని చూడడానికి ఆసక్తి చూపించడంతో ఓటీటీ సంస్థలు కూడా ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడుమనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మాత్రం ఒక హారర్ థ్రిల్లర్ కు సంబంధించినది.

హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంతో ఉత్కంఠగా సాగుతాయి. ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు థ్రిల్ కు గురి చేస్తాయి. అలాగే కూడా ఉంటాయి. అలాగే ఇంకొన్ని వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ను బాగా భయపెడతాయి. ఈ సిరీస్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఐస్‌లాండ్ లోని వీక్ అనే చిన్న పట్టణంలో, కట్లా అనే ఒక అగ్నిపర్వతం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీని నుంచి వెలువడే లావా, బూడిద తుఫానుల కారణంగా ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి చాలా మంది పట్టణం నుంచి దూరంగా వెళ్లిపోతారు. కొందరు మాత్రం పుట్టిన ఊరు మీద మమకారంతో అక్కడే ఉండిపోతారు. అలాగే కొందరు శాస్త్రవేత్తలు కూడా కట్లా అగ్ని పర్వతం దగ్గరే నివాసముంటారు. అయితే ఒక్క రోజు అగ్ని పర్వతం బద్దలైపోతుంది. బూడిద తుఫానులు సంభవించి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. దీంతో మిగిలిన వారు కూడా ప్రాణభయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. కట్ చేస్తే.. ఈ దుర్ఘటన జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు బూడిదతో కప్పబడిన అగ్నిపర్వతం నుంచి ఒక అమ్మాయి ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె ఆమె ఒక ఏడాది క్రితం ఈ అగ్నిపర్వతం పేలడంతో చనిపోయినట్లు అందరూ భావిస్తారు. ఆ అమ్మాయితో పాటు అగ్ని పర్వతం ఘటనలో చనిపోయిన వవారిలో చాలామంది తిరిగి రావడంతో స్థానికులతో పాటు శాస్త్రవేత్తలు అయోమయంలో పడతారు.
ఎలాగైనా ఈ మిస్టరీని ఛేదించాలని జియాలజిస్టులు ఆ అగ్ని పర్వతం దగ్గరకు వెళతారు. అక్కడ వారికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అలాగే షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మరి చనిపోయిన వాళ్లందరూ ఎలా తిరిగి వచ్చారు? అసలు ఆ ఆగ్ని పర్వతం దగ్గర ఏముంది? అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఇంతకీ ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కట్లా’ 2021లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాలు ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ ఎంతో ఉత్కంఠగా ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ లో కట్లా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు.








