OTT Movie: శోభనం రోజే నవ వధువులను చంపేసే ప్రేతాత్మ.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్
గతంలో ఓటీటీలో రిలీజై సంచలన విజయం సాధించిన ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. శోభనం రోజునే నూతన వధువులను ఎత్తు కెళ్లి రేప్ చేసి చంపేసే ఓ ప్రేతాత్మను హీరోయిన్ ఎలా అంతం చేసిందన్నదే ఈ మూవీ కథ.

ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో సందడి చేస్తున్నాయి సినిమాలు. ఇంకొన్ని అయితే నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అలా ఇటీవల థియేటర్లలో రిలీజై యావరేజ్ గా నిలిచిన ఓ తెలుగు హారర్ థ్రిల్లర మూవీ త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తోంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. పోటీగా పలు సినిమాలు కూడా రిలీజ్ కావడం ఈ మూవీకి మైనస్ గా మారింద. ఫలితంగా థియేట్రికల్ వెర్షన్ రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2. గతంలో ఓటీటీలో రిలీజై సంచలన విజయం సాధించిన ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై డి.మధు, సంపత్ నంది ఈ మూవీని నిర్మించారు. అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. సంపత్ నంది కథ అందించాడు. ఈ మూవీలో నాగసాధువుగా ఓ డిఫరెంట్ రోల్‌లో తమన్నా నటించింది. అలాగే హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ అయ్యింది.
ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఓదెల 2 మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. ఈ నేపథ్యంలో మే 16 నుంచి ఓదెల 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలోనూ ఓదెల 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్తగా పెళ్లైన అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేసే ప్రేతాత్మకు, నాగ సాధువుకు మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
One Word – VERYGOOD FILM ✅#TamannaahBhatia ENTRY Will be a BANGER Compare to Recent Films 🔥🔥🔥🔥#SampathNandi Direction – #Ajaneesh MUSIC is Major Asset With LORD SHIVA Story 🥵🥵🥵#GetsCinema – Reached – HYPEMETER – 89%#Odela2 #Odela2Review
— GetsCinema (@GetsCinema) April 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








