Actress Hema: నటి హేమ కూతురిని చూశారా? స్టార్ హీరోయిన్స్‌కు ఏం తక్కువ కాదు.. లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హేమ. 250 కు పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. మరి హేమ వారసురాలిగా ఆమె కూతురు ఇండస్ట్రీలోకి వస్తుందా?

హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సింపుల్ గా హేమగా మార్చుకుంది. అప్పుడెప్పుడో శ్రీదేవి, వెంకటేష్ ల క్షణ క్షణం నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ అందాల తార. 250 కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించింది హేమ. అయితే సినిమాలతో పాటు వివాదాల్లోనూ హేమ పేరు తరచూ వినిపించింది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో హేమ ప్రెస్ మీట్స్‌తో హొరెత్తిస్తుంది. తోటీ నటీనటుల గురించి సంచలన కామెంట్స్, ఆరోపణలు చేసింది. ఇక గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ హేమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పార్టీలో హేమ పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసును ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో కూడా ఉంది హేమ. కొన్ని రోజులకు బెయిల్‌పై బయటకు వచ్చింది. ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిందీ అందాల తార. కాగా ఆ మధ్యన సినిమాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది హేమ. ఇక సినిమాల్లో నటించే ప్రసక్తే లేదంటూ తేల్చిపారేసింది. అందుకు తగ్గట్టుగానే 2021లో క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన హేమ ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ చిన్న రోల్ పోషించింది. ఈ రెండూ తప్పితే మరే మూవీలోనూ ఈ నటి కనిపించలేదు
సినిమాల నుంచి తప్పుకున్న హేమ తన వారసురాలిగా కూతురిని సినిమా రంగంలోకి దింపుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో హేమ గారాల పట్టి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమెకు లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి చాలా అందంగా ఉందని, ఈమెలో హీరోయిన్ కావాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
హేమ కూతురు ఇషా..
View this post on Instagram
హేమ కూతురు పేరు ఇషా. అయితే ఆమె మీడియా, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటోంది. ఇక హేమ కూడా ఇషా ను సినిమా ఫంక్షన్స్ కు కూడా పెద్దగా తీసుకురాదు . ప్రస్తుతం ఇషాకు 24 ఏళ్లని తెలుస్తోంది. ప్రస్తుం ఆమె ఇంకా చదువుకుంటోందని తెలుస్తోంది. మరి భవిష్యత్ లో ఈ స్టార్ కిడ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం వస్తుందో?లేదో? చూడాలి.
కూతురితో హేమ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








