PF అకౌంట్‌లో తక్కువ డబ్బులు ఉన్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్!
ఉద్యోగం మారినా లేదా పదవీ విరమణ చేసినా EPF ఖాతాను పట్టించుకోకపోతే అది నిష్క్రియం అవుతుంది. రూ.1000 పైబడి బ్యాలెన్స్ ఉంటే డబ్బు ఆటోమేటిక్‌గా రాదు. UAN యాక్టివేషన్, సరైన KYC వివరాలతో పాటు EPFO పోర్టల్ ద్వారా క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ దశలను అనుసరించి మీ కష్టార్జితాన్ని రక్షించుకోండి.

ఉద్యోగం మారిన తర్వాత లేదా పదవీ విరమణ తరువాత చాలా మంది తమ EPF ఖాతాను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఫలితంగా అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా మారి డబ్బు అలాగే నిలిచిపోతుంది. నిపుణుల ప్రకారం ఖాతాలో రూ.1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే డబ్బు స్వయంచాలకంగా బ్యాంక్‌కు రాదు. సభ్యుడే క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాలి. EPFO నిబంధనల ప్రకారం వరుసగా 36 నెలలు ఎటువంటి లావాదేవీలు జరగకపోతే ఖాతాను నిష్క్రియంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త డిపాజిట్, ట్రాన్స్‌ఫర్ లేదా ఉపసంహరణ లేకపోతే ఖాతా పనిచేయకుండా మారుతుంది. ముఖ్యంగా పదవీ విరమణ తరువాత కూడా మూడు సంవత్సరాలు నిధులు తాకకుండా ఉంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 వరకు చిన్న బ్యాలెన్స్ ఉన్న కొన్ని ఇన్‌యాక్టివ్ అకౌంట్లను ఆటోమేటిక్‌గా బ్యాంకులకు బదిలీ చేసే విధానాన్ని అమలు చేసింది. అయితే రూ.1,000 కంటే ఎక్కువ ఉన్నవారు తప్పనిసరిగా తమ ఖాతాను యాక్టివేట్ చేసి క్లెయిమ్ చేయాలి. మొదట యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసి KYC వివరాలు పూర్తి చేయాలి. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు సరైన విధంగా ధృవీకరించబడాలి. అసంపూర్ణ KYC ఉంటే క్లెయిమ్ ఆలస్యమవుతుంది.
తర్వాత సభ్యుల పోర్టల్‌లో సహాయ విభాగానికి వెళ్లి నిష్క్రియ ఖాతాను యాక్టివేట్ చేయమని అభ్యర్థించాలి. యజమాని, అధికారుల ధృవీకరణ తర్వాత ఖాతా మళ్లీ సక్రియమవుతుంది. ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత పోర్టల్‌లో లాగిన్ అయి Online Services ద్వారా క్లెయిమ్ దాఖలు చేయాలి. పదవీ విరమణకు Form 19, పెన్షన్‌కు Form 10C లేదా అవసరాన్ని బట్టి Form 31 ఎంచుకోవచ్చు. సాధారణంగా కొన్ని రోజుల్లోనే డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
