AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట.. విజువల్స్ అద్దిరిపోయాయ్

ఈ మధ్యన తెలుగు సినిమాల్లో పల్లె పాటల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు జానపదాలను బాగా వాడేస్తున్నారు. అలా ఇటీవల రిలీజైన ఓ సినిమా పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లోనూ ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

Folk Song: పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట.. విజువల్స్ అద్దిరిపోయాయ్
Folk Song
Basha Shek
|

Updated on: Jul 27, 2026 | 6:48 PM

Share

ఇటీవల టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పళ్లబురుసు’. దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘బలగం’ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కొత్త సోకు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో సుధాకర్ రెడ్డి రంగురంగుల కళ్ల జోడుతో చాలా కొత్తగా కనిపించారు. అలాగే పాట కూడా చాలా ట్రెండీగా, విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లోని లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. గతంలో ‘పేపర్ బాయ్’లో ‘బొంబాయి పోతావా రాజా’ నుంచి పలు హిట్ సాంగ్స్ రాసిన సురేష్ గంగుల ఈ పాటకు తెలంగాణ పల్లెపదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు. అలాగే లవ్ స్టోరీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సారంగదరియా స్టైల్ లోనే ఇప్పుడు మరోసారి ‘కొత్త సోకు’ అంటూ మాంచి తెలంగాణ జానపదాన్ని అందించారు పవన్ సీహెచ్.

ఇక ‘పళ్లబురుసు’. సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్‌, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్..

పళ్ల బురుసు కొత్త ఫోక్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!