AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Saving: వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. నెల వచ్చేది.. 45 రోజులు రావడం పక్క!

వర్షాకాలంలో వంటగదిపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కానీ కిచెన్‌లో వినియోగించే గ్యాస్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోము. చాలా మంది చేసే తప్పు ఇదే.. ఎందుకంటే వర్షాకాలంలో చలి, తేమ కారణంగా వంట సమయం, వినియోగం పెరిగి మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుంది. సాధారణంగా రెండు నెలలు వచ్చే ఓ సిలిండర్.. వర్షాకాలం వచ్చే సరికి నెల రోజులకే అయిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో గ్యాస్‌ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం.

Anand T
|

Updated on: Jul 27, 2026 | 5:51 PM

Share
వర్షాకాలంలో గ్యాస్ వినియోగం ఎందుకు పెరుగుతుంది?: సాధారణ రోజులతో పోల్చుకుంటే వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం కారణంగా తరచుగా వంట చేయాల్సి రావడం, వంట సమయం పెరగడం జరుగుతుంది. అలాగే ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను నేరుగా పొయ్యి మీద పెట్టడం వంటి అలవాట్ల వల్ల గ్యాస్ ఎక్కువ అయిపోతుంది.

1 / 5
తక్కువ మంటపై వంట చేయడం మానుకోండి: అయితే గ్యాస్ ఆదా అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది తక్కువ మంటపై వంట చేస్తుంటారు. కానీ వర్షాకాలంలో మాత్ర ఇలా చేయడ వద్దు.. ఎందుకంటే తేమ కారణంగా వంట పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టి గ్యాస్ వృథా అవుతుంది. అంతేకాకుండా గాలికి మంట ఆరిపోయి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీడియం ప్లేమ్‌లో వంట చేయడం బెస్ట్.

2 / 5
ఫ్రిజ్‌లోని పదార్థాలను నేరుగా వండవద్దు: చాలా మంది ఫ్రిజ్ నుండి తీసిన పాలు, కూరగాయలు లేదా ఇతర పదార్థాలను నేరుగా వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. వంట చేయడానికి కొంత సమయం ముందే ఫ్రిజ్‌లోని పదార్థాలను బయట తీసి ఉంచి, అవి గది ఉష్ణోగ్రతకు వచ్చాక మాత్రమే వండటం ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా గ్యాస్‌ను ఆదా చేయొచ్చు.

3 / 5
ముందే నానబెట్టడం: చాలా మంది పప్పు వంటి కూరలు చేసేప్పుడు వాటిని నేరుగా మంటపై ఉడికించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా.. గ్యాస్ వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు వండటానికి ముందే పప్పు, బియ్యాన్ని కాసేపు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా మెత్తబడతాయి. దీనివల్ల వంట సమయం తగ్గడమే కాకుండా గ్యాస్ గణనీయంగా ఆదా అవుతుంది.

4 / 5
కొందరు గ్యాస్ వెలిగించడానికి లైటర్‌కు బదులు అగ్గిపుల్లలను కూడా వాడుతూ ఉంటారు. అయితే చాలా మంది గ్యాస్ ఆన్ చేసిన తర్వాత అగ్గిపుల్ల వెలిగిస్తారు. కానీ వర్షాకాలంలో గాలిలో తేమ కారణంగా అగ్గిపుల్ల త్వరగా అంటుకోదు.. లేదా త్వరగా ఆరిపోవచ్చు. అప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేయడం వల్ల అది లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అగ్గిపుల్లతో గ్యాస్ వెలిగించేప్పుడు.. ముందుగా అగ్గిపుల్లను వెలిగించి, ఆ తర్వాతే గ్యాస్ నాబ్‌ను ఆన్ చేయండి. ఈ చిన్న టిఫ్స్ ఫాలో అవ్వడం ద్వారా వర్షాకాలంలో గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు.

5 / 5
Follow Us
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్

కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..

జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా

తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌

పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!

బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?

తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!