AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.

బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే మాంబోజీపల్లి మార్కెట్ (సంత)లో పట్టపగలే చేతివాటం ప్రదర్శించారు దుండగులు. కూరగాయలు కొనేందుకు వెళ్లిన దంపతులను టార్గెట్ చేశారు.

సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.
Vegetables Market
P Shivteja
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 9:03 PM

Share

బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే మాంబోజీపల్లి మార్కెట్ (సంత)లో పట్టపగలే చేతివాటం ప్రదర్శించారు దుండగులు. కూరగాయలు కొనేందుకు వెళ్లిన దంపతులను టార్గెట్ చేశారు. ఏకంగా 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కొల్చారం మండలానికి చెందిన చింతలగారి శ్రావణి – ప్రవీణ్ దంపతులిద్దరూ మెదక్ వెళ్లి తిరిగి వస్తున్నారు. దారిలో మాంబోజీపల్లి సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగారు. ఆ సమయంలో రద్దీని అదునుగా తీసుకున్న గుర్తు తెలియని మాయగాళ్లు శ్రావణి హ్యాండ్ బ్యాగులోని నగలను మాయం చేశారు. 2.5 తులాల బంగారు నెక్లెస్, 2 తులాల నల్లపూసల గొలుసు, అర తులం బరువున్న మాటీలు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. మొత్తం వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని దంపతులు తెలిపారు.

మార్కెట్‌లో కూరగాయలు తీసుకున్న కాసేపటికే బ్యాగ్ తనిఖీ చేసిన శ్రావణి.. అందులో నగలు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. సంతలో అటు ఇటు వెతికినా ఫలితం లేకపోయింది. హుటాహుటిన బాధితులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సంతలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుల కదలికలను పోలీసులు పరిశీలించారు. జనసందోహం ఎక్కువగా ఉండే సంతలు, మార్కెట్లలో మహిళలు తమ నగలు, బ్యాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us