AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon Peel: తొక్కే కదా అని తీసి పరేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వేస్ట్ చేయరు

వేసవి కాలంలో మామిడి పండ్ల తర్వాత అందరూ ఇష్టంగా తినేది పండు ఏదైనా ఉందంటే అది పుచ్చకాచే. ఇది సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, మనల్ని తాజాగా ఉంచుతుంది. అయితే సాధారణంగా మనం పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తిని, తొక్కలను పారేస్తుంటాం. కానీ చాలా మంది తెలియని విషయం ఏమిటంటే ఆ తొక్కల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి పుచ్చకాయ తొక్కలతో వంటింట్లో తయారు చేసుకోగలిగే కొన్ని అద్భుతమైన వంటకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 16, 2026 | 6:52 AM

Share
పుచ్చకాయ కూర: పుచ్చకాయ కర్రీ చేసుకునేందుకు పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగాన్ని చిన్న ముక్కలుగా కోసి.. ఆలుగడ్డ, టమోటా, మసాలాలతో కలిపి వండుకోవచ్చు. ఇది కొంచెం తీపి, కొంచెం కారంగా ఉండి, అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది.

1 / 5
పుచ్చకాయ తొక్క పచ్చడి: మీకు పచ్చళ్లు ఇష్టమైతే, పుచ్చకాయ తొక్కలతో పచ్చడి ట్రై చేయండి. తొక్కలను ఉడికించి పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు లేదా నిమ్మరసంతో కలిపి గ్రైండ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది దోశలు, ఇడ్లీలు లేదా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

2 / 5
ఊరగాయ: మామిడికాయ ఊరగాయ లాగే, పుచ్చకాయ తొక్కలతో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చని చాలా మందికి తెలియదు. దీన్ని చేసుకోవానికి ముందుగా పుచ్చకాయ తొక్కను ముక్కలుగా కట్‌చేసి వాటికి ఉప్పు, కారం, నూనె, ఆవపిండి కలిపి ఎండలో పెడితే, కొన్ని రోజుల్లోనే మంచి రుచికరమైన ఊరగాయ సిద్ధమవుతుంది.

3 / 5
స్వీట్ హల్వా: పిల్లల కోసం ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే, పుచ్చకాయ తొక్కల హల్వా ఉత్తమమైనది. ఇది తయారు చేసేందుకు తొక్కలను చిన్నగా తురిమి  పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి ఉడికిస్తే కమ్మని హల్వా రెడీ అవుతుంది.

4 / 5
జ్యూస్: పుచ్చకాయ తొక్కలతో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. వీటిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ తొక్కలను పడేయకుండా ఇలా చేయడం వల్ల మనం ఆహారాన్ని వృథా చేయకుండా, పర్యావరణానికి కూడా మేలు చేసినవారమవుతాము.

5 / 5
Follow Us
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు..

రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై..

అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్

టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు

చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..

సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..

దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..

కాణిపాకం వినాయకుడి 21 కేజీల లడ్డూకు భారీ ధర..

సైనికుడి పార్థివదేహంతో వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదం..నలుగురు మృతి