AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు.. ఆరోగ్యానికి అమృతం!

భారతీయ వంటగదిలో మెంతులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే వీటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే అది ఖరీదైన మందుల కంటే బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు.

ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు.. ఆరోగ్యానికి అమృతం!
Soaked Fenugreek Seeds
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2026 | 6:46 AM

Share

మన వంటింట్లో సులభంగా దొరికే మెంతులలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మెంతులు కేవలం పోపు దినుసులే కాకుండా, ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా పరిగణించబడతాయి. మెంతులను నేరుగా తీసుకోవడం కంటే, నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి మరింత సమర్థవంతంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులలో ఉండే గెలాక్టోమన్నన్ అనే మూలకం రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.

మెంతులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఉదయాన్నే మెంతులు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినడం (Overeating) తగ్గి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా మారడానికి ఇవి సహాయపడతాయి. శరీరంలోని ఎల్‌డీఎల్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి, తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

ఎలా తీసుకోవాలి?: ఒక స్పూన్ మెంతులను రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి, నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, గర్భిణీ స్త్రీలు లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల కోసం మందులు వాడుతున్న వారు వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. సహజమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెంతులు ఒక చౌకైన, శక్తివంతమైన మార్గం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా