శ్రీలీల ఎంబీబీఎస్ ఎలా పూర్తి చేసిందో తెలుసా? స్వయంగా చెప్పిన హీరోయిన్
15 April 2026
Basha Shek
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
కాగా శ్రీలీల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకెంతో ఇష్టమైన డాక్టర్ చదువుని కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితమే ఎంబీబీఎస్ డిగ్రీ కూడా అందుకుందీ అందాల తార. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యింది శ్రీలీల.
ఒక వైపు నటిగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు డాక్టర్ పట్టా అందుకోవడం కోసం ఆమె పడిన కష్టం గురించి మాట్లాడుతూ శ్రీలీల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
'మనం రెండు పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు మన మనసుని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. షూటింగ్లో ఉండి ఇంటికొచ్చిన తర్వాత మళ్లీ చదవాలి అంటే ఎంతో ఒత్తిడిగా అనిపించేది.
'ఆ సమయంలో నాకు పిచ్చెక్కిపోతుందేమో అనే భావన కలిగి ఉండేది. అయితే నాకు డాక్టర్ కావాలన్న కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది'
'అందుకే ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన పుస్తకాలను చేతిలో పట్టుకున్నాను. షూటింగ్ లొకేషన్ లో ఖాళీ దొరికిన కూడా చదువుకునేదాన్ని' అని చెప్పుకొచ్చింది శ్రీలీల.
తన మెడిసిన్ చదువు గురించి శ్రీలీల చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.