Malaika Arora: చిక్కుల్లో బాలీవుడ్ నటి మలైకా అరోరా! ఆ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ !
బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 45 ఏళ్లు దాటినా ఎంతో అందంగా, ఫిట్ గా ఉంటూ కుర్ర హీరోయిన్లుకు పోటీనిస్తోందీ అందాల తార. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ అనవసర వివాదంలో చిక్కుకుంది. ఓ కేసులో ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశముంది.

బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా తన బోల్డ్, గ్లామరస్ లుక్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు, మలైకా ఇబ్బందుల్లో చిక్కుకుంది ఓ కేసులో ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ కేసు 2012లో ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన గొడవకు సంబంధించినది. ఇందులో దేవర విలన్, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృత అరోరా భర్త షకీల్ లడక్, అతని స్నేహితుడు బిలాల్ అమ్రోహి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో సాక్షిగా హాజరు కావాలని కోర్టు నటి మలైకా అరోరాను కోరింది. సోమవారం ముంబై మేజిస్ట్రేట్ కోర్టు మలైకాకు చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణకు హాజరు కాకపోతే ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడుతుందని హెచ్చరించింది. సమన్లు అందినప్పటికీ ఆమె హాజరు కాకపోవడంతో ఏప్రిల్ 08న మలైకాపై కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈసారి కూడా మలైకా కోర్టుకు హాజరు కాలేదు. ‘ కేసు ముందుకు సాగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు మలైకా తదుపరి తేదీన హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ‘ఈ విషయం తెలిసినప్పటికీ, మలైకా హాజరు కాలేదు’ అని కోర్టు పేర్కొంది.
కోర్టు చెప్పినట్లుగా, ‘ఆమె తదుపరి విచారణకు హాజరు కాకపోతే, ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశుమంది.’ ఈ నెల ప్రారంభంలో, కోర్టు నటిపై రూ. 5,000 బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, ఏప్రిల్ 29 లోపు నివేదిక ఇవ్వాలని కోరింది. ఇప్పుడు మలైకాకు హాజరు కావడానికి చివరి అవకాశం కల్పించారు. ఈ కేసులో మలైకాతో పాటు ఆమె సోదరి అమృత అరోరా, ఇతరులను కూడా సాక్షులుగా చేర్చారు.
మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
కేసు ఎంటంటే?
ఈ కేసు 2012 నాటిది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, మలైకా అరోరా, కరిష్మా కపూర్, అమృత అరోరా, వారి సన్నిహితులు కొందరు ఒక హోటల్‌లో డిన్నర్ చేస్తున్నారు. అదే సమయంలో నటుడు సైఫ్ అలీఖాన్ హోటల్‌కు వచ్చిన వ్యాపారవేత్త ఇక్బాల్ మీర్ శర్మతో గొడవ పడ్డాడు. సైఫ్ ఒక వ్యాపారవేత్త, అతని మామపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే మలైకా ఆరోరా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలున్నాయి.
View this post on Instagram








