AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు వాయిదా..?’ క్లారిటీ ఇచ్చిన బోర్డు

సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 7, 2026న మిడిల్ ఈస్ట్ దేశాలలో జరగాల్సిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు..

'అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు వాయిదా..?' క్లారిటీ ఇచ్చిన బోర్డు
Fake Notice On CBSE Class 10, 12 Board Exams
Srilakshmi C
|

Updated on: Mar 01, 2026 | 5:54 PM

Share

న్యూఢిల్లీ, మార్చి 1: దేశ వ్యాప్తంగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 7, 2026న మిడిల్ ఈస్ట్ దేశాలలో జరగాల్సిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్లు న్యూస్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు ఆదివారం (మార్చి 1, 2026న) అధికారిక సర్క్యులర్ ద్వారా ప్రకటన విడుదల చేసినట్లు ప్రచారం అవుతుంది. ఇందులో అమెరికా – ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుత పరిస్థితుల కారణంగా పరీక్షలు వాయిదా పడినట్లు సదరు సర్క్యూలర్‌ పేర్కొంది. ప్రభావిత దేశాల్లో బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉన్నాయి. ఈ సర్క్యులర్ ఈ ప్రాంతాలలోని సీబీఎస్సీ అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో మార్చి 7వ తేదీన జరగనున్న పదవ తరగతి, పన్నెండో తరగతి సోషల్ సైన్స్ పరీక్షలు వాయిదా పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఫిబ్రవరి 28 వరకు జరిగిన లాంగ్వేజ్‌ పరీక్షలు రద్దు అయ్యాయని కూడా ఇందులో ప్రస్తావించింది. ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆ ప్రకటనలో ఉంది. దీంతో ఈ పరీక్షల వాయిదా వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై తాజాగా సీబీఎస్సీ బోర్డు సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

దుబాయ్‌ సీబీఎస్సీ కార్యాలయం జారీ చేసినట్లు చక్కర్లు కొడుతున్న సదరు సర్క్యూలర్‌ పూర్తిగా అవాస్తవమని కొట్టివేసింది. ఇలాంటి ప్రకటన ఏదీ తాము చేయలేదని స్పష్టం చేసింది. విద్యార్దులు గందరగోళానికి గురికావొద్దని, అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే విద్యార్ధులు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. దీనిపై దుబాయ్‌లోని CBSE ప్రాంతీయ కార్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్, విదేశీ CBSE పాఠశాలల అధిపతి డాక్టర్ రామ్ శంకర్ కూడా ఇప్పటికే CBSE ప్రధాన కార్యాలయానికి వివరణాత్మక నివేదికను సమర్పించారు. నకిలీ సర్క్యులర్‌లోని విషయాలను డాక్టర్ శంకర్ తోసిపుచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సీబీఎస్సీ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌లు, వెబ్‌సైట్‌లను మాత్రమే విశ్వసించాలని హెచ్చరించారు. స్థానిక నియంత్రణ సంస్థలు, భారత రాయబారి, కాన్సుల్ జనరల్, CBSE ఛైర్మన్‌లతో చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ధృవీకరించారు. పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని, షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ప్రస్తుతం భారతదేశం అంతటా 10వ తరగతికి 8,074 కేంద్రాలలో, 12వ తరగతికి 7,574 కేంద్రాలలో, విదేశాలలో 26 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. మొత్తం 43 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!
ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!
పచ్చి కొబ్బరి, మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా నూరి తింటే ఆ రుచే వేరు
పచ్చి కొబ్బరి, మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా నూరి తింటే ఆ రుచే వేరు
పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇలా చేయండి...
పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇలా చేయండి...
మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఇలా తెలుసుకోండి
మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఇలా తెలుసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..
వామ్మో వీడు మాములోడు కాదు..!
వామ్మో వీడు మాములోడు కాదు..!
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..