OTT Movie: 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. ఓటీటీలో దుమ్ము రేపుతోన్నరియల్ క్రైం స్టోరీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్
వాస్తవ సంఘటనలు, అలాగే ప్రముఖుల జీవిత గాథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఈ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందినదే. దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో కొన్ని ఇప్పటికే థియేటర్లలో రిలీజైనవి కాగా, మరికొన్ని మాత్రం డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ఒక క్రైమ్ డ్రామా కూడా ఉంది. దేశ చరిత్రలో అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న ఓ కస్టమ్ ఆఫీసర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గోవాలో గోల్డ్, డ్రగ్స్ స్మగ్లింగ్‍ను అడ్డుకునేందుకు కస్టమ్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో అతనికి ఎదురయ్యే అనుభవాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఒకసారి1500 కిలోల అక్రమ బంగారం, గోవా తీరానికి రావడాన్నిహీరో పసిగడతాడు. దీంతో షిప్ నుంచి ఆ బంగారాన్ని తీసుకుని.. కారులో తీసుకెళ్లే స్మగ్లర్ ఫాలో అవుతాడు. గోల్డ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఆఫీసర్ కు, స్మగ్లర్ మధ్య అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈక్రమంలోనే ఊహించని రీతిలో స్మగ్లర్ కన్నుమూస్తాడు. ఈ స్మగ్లర్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడు కావడంతో ఆఫీసర్ ఇబ్బందుల్లో పడతాడు. తన సోదరుడిని కస్టమ్స్ ఆఫీసరే హత్య చేశాడని కేసు పెడతాడు. దీంతో సీబీఐ రంగంలోకి దిగుతుంది. కస్టమ్స ఆఫీసర్ ను అదుపులోకి తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? స్మగ్లర్ ను ఆ ఆఫీసరే హత్య చేశాడా? సంఘటన తర్వాత సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా క్రైమ్ సీన్ నుంచి ఎందుకు పారిపోయాడు? మర్డర్ కేసు తర్వాత అతడి జీవితం ఎలా మారిపోయిందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోస్టావో. నిజాయితీగల కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నవాజుద్దీన్ నటన అదరగొట్టాడు. డైరెక్టర్ సేజల్ షా తెరకెక్కించిన ఈ రియల్ క్రైమ్ డ్రామాలో ప్రియా బాపట్, కిశోర్ కుమార్, మహిక శర్మ, హుసేన్ దలాల్, దేవినా కొలాకో, గగన్ దేవ్ రియార్, రవి శంకర్ జైస్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వినోద్ భానుశాలి, కమలేశ్ భానుశాలి, భవేశ్ మండాలియా, సేజల్ షా, శ్యామ్ సుందర్, ఫైజుద్దీన్ సిద్ధీఖీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
కోస్టావ్ సినిమా మే 1వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డైరెక్టుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మూవీ జీ5లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
జీ5లో స్ట్రీమింగ్..
The verdict is out! #Costao is officially a must-watch 💥 #Costao streaming now, only on #ZEE5.
▶️ https://t.co/t6GWip5WqZ#CostaoOnZEE5@Nawazuddin_S @bapat_priya @hussainthelal #KishorKumarG @GaganDevRiar @sejtherage @vinodbhanu #BhaveshMandalia #KamleshBhanushali… pic.twitter.com/3KICZosRzV
— ZEE5 Global (@ZEE5Global) May 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








