AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Admit Cards 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే అడ్మిట్‌ కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి సంబంధించి మరో 5 రోజుల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన సిటి ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు అభ్యర్ధులు..

RRB Railway Admit Cards 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే అడ్మిట్‌ కార్డులు.. సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో
RRB Technician admit card
Srilakshmi C
|

Updated on: Mar 01, 2026 | 2:40 PM

Share

హైదరాబాద్‌, మార్చి 1: కేంద్ర రైల్వే శాఖ ఆధ్వర్యంలోని వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న రైల్వే టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి సంబంధించి మరో 5 రోజుల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన సిటి ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు అభ్యర్ధులు ముందుగా తమ పరీక్ష నగరం వివరాలు తెలుసుకునేందుకు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అభ్యర్ధులు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక పరీక్ష అడ్మిట్‌ కార్డులు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. అంటే పరీక్ష తేదీకి సరిగ్గా నాలుగు రోజుల ముందు అభ్యర్ధుల అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో మార్చి 6వ తేదీన పరీక్ష రాసే అభ్యర్ధులకు మార్చి 3వ తేదీన అడ్బిట్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ సీటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఇటీవలే పరీక్షల రివైజ్‌డ్‌ ఎగ్జామ్స్‌ తేదీలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. గతంలో (జనవరిలో) విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీలను తాజాగా ఆర్‌ఆర్‌బీ మార్చింది. దీంతోఒక రోజు తర్వాత నుంచి పరీక్షలు మొదలవనున్నాయి. ఇక రైల్వేలో వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌, తదితర విభాగాల్లో టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష, మెడికల్‌ పరీక్షలు, సర్టిపికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది. ఇతరవ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్