AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్ల దగ్గర నాని హిట్-3 సినిమా హవా నడుస్తోంది. గతవారం రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టుతోంది. అలాగే రెట్రో సినిమాకు కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే వేసవి వినోదాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు థియటేర్లలోకి రాబోతున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: May 05, 2025 | 12:09 PM

Share

ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం శ్రీ విష్ణు సింగిల్. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ తో ఆసక్తిరేకెత్తించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న శుభం సినిమాకూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే శ్రద్ధా శ్రీనాధ్‌ కలియుగమ్‌-2064, నవీన్ చంద్ర బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్లీ థియేటర్లలో సందడి కానుంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే. .ఈ వారం ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది. ఎందుకంటే తలా అజిత్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే ప్రదీప్, దీపికా పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో..

  • ది మ్యాచ్‌ (సినిమా)- మే 7
  • లాస్ట్‌ బుల్లెట్‌ (సినిమా)- మే 7
  • గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (తమిళ/తెలుగు)- మే 08

  • ది హాంటెడ్‌ అపార్ట్‌మెంట్‌ ‘మిస్సిక్‌’ (సినిమా)- మే8
  • బ్యాడ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ (సినిమా) మే 8
  • ది డిప్లొమ్యాట్‌ (సినిమా)- మే
  • ది రాయల్స్‌ (వెబ్‌సిరీస్‌)- మే 9

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో..

  • గ్రామ్‌ చికిత్సాలయమ్‌ (హిందీ) -మే 09

ఈటీవీ విన్‌

  • అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు)- మే 08

జియో హాట్‌స్టార్‌

  • స్టార్‌ వార్స్‌ (యానిమేషన్‌)- మే 04
  • యువ క్రైమ్‌ ఫైల్స్‌ (మూవీ)- మే 5
  • పోకర్‌ ఫేస్‌ (వెబ్‌సిరీస్‌)- మే 9

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us