AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘నెల్లూరు పెద్దా రెడ్డి తాలుకా’.. అల్లు అర్జున్ టీషర్ట్‌పై విమర్శలు.. బన్నీ వాసు స్ట్రాంగ్ కౌంటర్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఓ వైట్ టీ షర్ట్ తో కనిపించాడు. అందులో బ్రహ్మనందం ఫన్నీమీమ్ ఉంది. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా అని కూడా రాసి ఉంది. ఈ టీషర్ట్ బన్నీ అభిమానులకు తెగ నచ్చేసింది. అదే సమయంలో కొందరు మాత్రం దీనిని నెగెటివ్ గా తీసుకున్నారు.

Allu Arjun: 'నెల్లూరు పెద్దా రెడ్డి తాలుకా'.. అల్లు అర్జున్ టీషర్ట్‌పై విమర్శలు.. బన్నీ వాసు స్ట్రాంగ్ కౌంటర్‌
Allu Arjun, Bunny Vas
Basha Shek
|

Updated on: May 04, 2025 | 1:03 PM

Share

పుష్ప 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ ఓ వైట్ టీ షర్ట్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఆ టీ షర్ట్ మీద గాడ్ ఆఫ్ మీమ్ బ్రహ్మానందం ఫొటో ఉంది. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా అని కూడా రాసి ఉంది. ఈ టీషర్ట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. చాలా మందికి ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులకు ఈ టీషర్ట్ తెగ నచ్చేసింది. అయితే కొంతమంది మాత్రం దీనిని నెగెటివ్ గా తీసుకున్నారు. బన్నీ టీ షర్ట్, ఓ రాజకీయ పార్టీకి ముడిపెడుతూ కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు ప్రముఖ నిర్మాత బన్నీ వాస్.

‘ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడు పై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా..? మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదు కానీ అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు. వీలైతే గొడవలు ఆపుదాం.. మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్ లో రాలేదనుకుంటా.. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలెట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు సార్..?’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు బన్నీ వాస్.

ప్రస్తుతం ఈ టాలీవుడ్ నిర్మాత ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్