- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss fame TV Actress Yashmi Gowda Latest Crazy Stunning Photos
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో అందమైన విలన్.. బుల్లితెర బ్యూటీని ఇప్పుడు చూస్తే..
బుల్లితెరపై ఈ అమ్మడు చాలా ఫేమస్. హీరోయిన్ గా పలు సీరియల్స్ చేసింది. కానీ ఆ తర్వాత విలన్ గా మారి అదరగొట్టేసింది. సీరియల్స్ ద్వారా తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోకు ఎంట్రీ ఇచ్చింది.తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Updated on: May 04, 2025 | 12:59 PM

యష్మీ గౌడ.. ఈ పేరు గుర్తుందా.. ? తెలుగు రాష్ట్రాల సీరియల్ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మొదట్లో కన్నడలో పలు సీరియల్స్ చేసింది.

తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్లో అమాయకమైన హీరోయిన్ పాత్రలో కనిపించిన యష్మీ.. ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్లో విలన్ పాత్రలో కనిపించింది.

నెగిటివ్ షేడ్స్ ఉన్న ముకుంద పాత్రలో అదరగొట్టేసింది. ఇందులో ఈ అమ్మడు యాక్టింగ్ వేరేలెవల్ అనే చెప్పాలి. ఈ సీరియల్ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది. అయితే ఈ షో ద్వారా మరింత నెగిటివిటీని మూటగట్టింది.

ఇందులో ఆమె ఆట తీరు, ప్రవర్తన పై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరో సీరియల్ చేయలేదు యష్మీ. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. లంగావోణిలో ట్రెడిషనల్ బుట్టబొమ్మలా కనిపిస్తుంది యష్మీ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి.




