Nani : ఓ యాక్సిడెంట్ నాజీవితాన్ని మార్చేసింది.. ఆ చిన్నపాపను చూసి తట్టుకోలేకపోయా: నాని
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న సినిమా హిట్ 3. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో వచ్చిన ఈసినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. ఇటీవలే నిర్మాతగా కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ హిట్ గా నిలిచింది. ఇక హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు న అని. దసరా సినిమాతో మొదలుపెట్టి వరుసగా హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన హిట్ 3 సినిమా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. భారీ హిట్ దిశాగా దూసుకుపోతోంది హిట్ 3. దసరా సినిమా తర్వాత మరోసారి నాని మాస్ అవతార్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..
తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం గురించి తెలిపాడు. నాని మాట్లాడుతూ.. నేను కారు కొనడానికంటే ముందు నాకొక రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక రోజు నా ఫ్రెండ్ కారు తీసుకుని కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి హైవేపై డ్రైవ్‌కు వెళ్లా. రోడ్డుపై ఆగిఉన్న లారీని మా కారు గుద్దేసింది. నైట్ టైం కావడంతో చీకట్లో కనిపించలేదు.. అక్కడ లారీ ఉంది అని తెలుసుకునే లోగా యాక్సిడెంట్ అయ్యిపోయింది. లారీ వెనక భాగం మా కారులోకి వచ్చేసింది. ముందు ఉన్న అద్దం ముక్కలై నా ఒళ్ళంతా గుచ్చుకుంది. దాంతో నా బాడీ మొత్తం రక్తం .. నా పక్క సీట్ లో నా ఫ్రెండ్ స్పృహ కోల్పోయాడు .. చివరకు ఏదోలా ఆ కారులో నుంచి బయట పడ్డాం..
ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే
అయితే మమ్మల్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మేము వెళ్లే దారిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి వాహనానికి ప్రమాదం జరిగింది. చాలా మందికి గాయాలు అయ్యాయి.వారిలో ఓ చిన్న పాప కూడా ఉంది. వాళ్ళను కూడా మా అంబులెన్స్‌లోనే ఎక్కించారు. ఆ చిన్న పాపను అలా చూసి నేను తట్టుకోలేకపోయా.. నాకు జరిగిన ప్రమాదం గురించి మర్చిపోయా.. ఆ పాపను ఐసీయూ లో ఉంచారు. ఆ పాపపు ఎలా ఉందో తెలుసుకోవాలని ఉదయం వరకూ ఆ రూమ్ బయటే నిల్చొని ఉన్నా.. ఆ రాత్రి నాజీవితాన్ని మార్చేసింది. ఆ ప్రమాదం తర్వాత నేను జీవితాన్ని చూసే విధానం మారిపోయింది. ఈ భూమిమీద ఉండే ప్రతిక్షణం మనకు ఓ వరం.. ప్రతిక్షణాన్ని సంతోషంగా జీవించాలి అని అర్ధమైంది అని నాని తెలిపారు. ఈకామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




