Tollywood: ఫస్ట్ మూవీకి రూ.10 రెమ్యునరేషన్.. ఇండస్ట్రీలో చక్రం తిప్పి.. చివరకు ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుని..
సినీరంగంలో విజయవంతమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ తారలతో నటించిన ఓ హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ రూ.10 అని మీకు తెలుసా.. ? ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

భారతీయ సినీరంగంలో తనదైన ముద్రవేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ చక్రం తిప్పింది. సినిమాల్లో విజయవంతమైన ఆమె.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసింది. కానీ ఇప్పుడు ఆమె 8 వేర్వేరు భాషలలో 300లకుపైగా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు ఆమె గ్లామర్ రంగానికి దూరంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. జయప్రద. ఆమె అసలు పేరు జయప్రద. ఒక తెలుగు సినిమా ఫైనాన్షియర్ కుమార్తె. ఆమె చిన్నతనంలో డాక్టర్ కావాలనుకుంది. కానీ పాఠశాల వార్షికోత్సవంలో ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన డైరెక్టర్ తెలుగు చిత్రం భూమి కోసం (1974)లో మూడు నిమిషాల డ్యాన్స్ రోల్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆమె మొదటి చిత్రానికి ఆమె పారితోషికం కేవలం రూ. 10 తీసుకుంది. ఆ మూడు నిమిషాల పాత్ర ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1976 నాటికి తెలుగు చిత్రాలలో అగ్ర కథానాయికగా మారింది. జయప్రద తెలుగులో హిట్ అయిన సిరి సిరి మువ్వ చిత్రానికి రీమేక్ అయిన సర్గం (1979) ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ కూడా తెచ్చిపెట్టింది. తెలుగు, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది.
1985లో, జయప్రద పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో, నిర్మాత మరియు ఆమె సన్నిహితుడు శ్రీకాంత్ నహత ఆమెకు అండగా నిలిచారు. అప్పుడు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటికే శ్రీకాంత్ నహతకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి వివాహం 1986లో జరిగింది. అప్పట్లో వీరిద్దరి వివాహం పెద్ద సంచలనంగా మారింది. కానీ కొన్నాళ్లకే ఇద్దరు విడిపోయారు. కొన్నాళ్లు ఒంటరిగా జీవించింది.
1994లో తెలుగు దేశం పార్టీ (టిడిపి) వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు ఆహ్వానం మేరకు టీడీపీ పార్టీలో చేరారు. అప్పట్లో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 2009లో యుపిలోని రాంపూర్ నుండి ఎంపిగా గెలిచారు. 2019లో బీజేపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు జయప్రద.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




