AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టే కదా అని పారేస్తున్నారా? ఉల్లి గడ్డ పొట్టులో ఉన్న అద్భుత లాభాలు తెలుసుకుంటే షాక్ అవుతారు!

Onion Peel Benefits: ఉల్లిపాయ పొట్టుతో ఎన్నో లాభాలున్నాయి. సాధారణంగా మనం ఇవి పనికిరావని భావించి పారవేస్తాం. కానీ ఈ ఉల్లిపాయ పొట్టు లేదా తొక్కలు ఇంటి పనుల్లో, అందం సంరక్షణలో, తోటపనుల్లో చాలా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ పొట్టులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి, రోజువారీ ఉపయోగాలకు సహాయపడతాయి. ఇప్పుడు ఉల్లిపాయ తొక్కలను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

Rajashekher G
|

Updated on: Mar 16, 2026 | 8:00 PM

Share
Onion Peels: ప్రతిరోజూ వంటగదిలో చాలా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర వ్యర్థాలు జమ అవుతాయి. చాలామంది వాటిని పనికిరావని భావించి చెత్తబుట్టలో వేస్తారు. కానీ, నిజానికి వాటిలో కూడా అనేక ప్రయోజనాలు దాగి ఉంటాయి. అలాంటివాటిలో ఉల్లిపాయ పొట్టు  కూడా ఒకటి. సాధారణంగా మనం ఇవి పనికిరావని భావించి పారవేస్తాం. కానీ ఈ ఉల్లిపాయ పొట్టు లేదా  తొక్కలు ఇంటి పనుల్లో, అందం సంరక్షణలో, తోటపనుల్లో చాలా ఉపయోగపడతాయి. 
ఉల్లిపాయ పొట్టులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి, రోజువారీ ఉపయోగాలకు సహాయపడతాయి. ఇప్పుడు ఉల్లిపాయ తొక్కలను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

Onion Peels: ప్రతిరోజూ వంటగదిలో చాలా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర వ్యర్థాలు జమ అవుతాయి. చాలామంది వాటిని పనికిరావని భావించి చెత్తబుట్టలో వేస్తారు. కానీ, నిజానికి వాటిలో కూడా అనేక ప్రయోజనాలు దాగి ఉంటాయి. అలాంటివాటిలో ఉల్లిపాయ పొట్టు కూడా ఒకటి. సాధారణంగా మనం ఇవి పనికిరావని భావించి పారవేస్తాం. కానీ ఈ ఉల్లిపాయ పొట్టు లేదా తొక్కలు ఇంటి పనుల్లో, అందం సంరక్షణలో, తోటపనుల్లో చాలా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ పొట్టులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి, రోజువారీ ఉపయోగాలకు సహాయపడతాయి. ఇప్పుడు ఉల్లిపాయ తొక్కలను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

1 / 6
1. సహజ ఎరువుగా..

ఉల్లిపాయ తొక్కలను సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇవి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

1. సహజ ఎరువుగా.. ఉల్లిపాయ తొక్కలను సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇవి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

2 / 6

2. జుట్టు సంరక్షణకు.. 

ఉల్లిపాయ తొక్కలు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఒక గిన్నెలో నీరు తీసుకుని ఉల్లిపాయ తొక్కలను వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెరిసేలా, బలంగా,  మందంగా మారుతుంది.

2. జుట్టు సంరక్షణకు.. ఉల్లిపాయ తొక్కలు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఒక గిన్నెలో నీరు తీసుకుని ఉల్లిపాయ తొక్కలను వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెరిసేలా, బలంగా, మందంగా మారుతుంది.

3 / 6

3. టీగా.. 

కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే.. ఉల్లిపాయ తొక్కలతో టీ కూడా తయారు చేయవచ్చు. ఈ టీ తాగడం వల్ల ఊబకాయం తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఉపయోగపడుతుంది.

3. టీగా.. కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే.. ఉల్లిపాయ తొక్కలతో టీ కూడా తయారు చేయవచ్చు. ఈ టీ తాగడం వల్ల ఊబకాయం తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఉపయోగపడుతుంది.

4 / 6

4. చర్మ సంరక్షణకు.. 

ఉల్లిపాయ తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. తొక్కలను నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటిని చర్మానికి అప్లై చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది.

4. చర్మ సంరక్షణకు.. ఉల్లిపాయ తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. తొక్కలను నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటిని చర్మానికి అప్లై చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది.

5 / 6
5. ఇంటి శుభ్రపరచడానికి.. 

ఉల్లిపాయ తొక్కలను ఇంటి శుభ్రపరచడంలో కూడా ఉపయోగించవచ్చు. తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటితో వంటగదిని లేదా ఇంటిని శుభ్రం చేస్తే దుర్వాసనలు తొలగిపోతాయి. దీనిని ప్రతిరోజూ కూడా ఉపయోగించవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

5. ఇంటి శుభ్రపరచడానికి.. ఉల్లిపాయ తొక్కలను ఇంటి శుభ్రపరచడంలో కూడా ఉపయోగించవచ్చు. తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటితో వంటగదిని లేదా ఇంటిని శుభ్రం చేస్తే దుర్వాసనలు తొలగిపోతాయి. దీనిని ప్రతిరోజూ కూడా ఉపయోగించవచ్చు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

6 / 6
Follow Us