AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సూపర్ ఫుడ్స్‌తో 50 ఏళ్ళవాళ్లు కూడా 20 ఏళ్లయవ్వనంగా కనిపిస్తారు!

Anti-aging Foods: మనం తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలా వరకు మన ఆరోగ్య సమస్యలు తీరిపోవడంతోపాటు యవ్వనంగా కనిపించే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే 50 ఏళ్ల వయస్సులోనూ 20 ఏళ్లలా మెరిసే చర్మం సాధ్యమవుతుంది. కొన్ని “సూపర్ ఫుడ్స్” తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా ఉంటుంది. ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సూపర్ ఫుడ్స్‌తో 50 ఏళ్ళవాళ్లు కూడా 20 ఏళ్లయవ్వనంగా కనిపిస్తారు!
Anti Aging Foods
Rajashekher G
|

Updated on: Mar 16, 2026 | 7:31 PM

Share

ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా 50 ఏళ్ల వయస్సు వచ్చిన వారే వృద్ధులలా మారిపోతున్నారు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ వాటిని అనుసరించడం సాధ్యం కావడం లేదు. అయితే, మనం తీసుకునే ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలా వరకు మన ఆరోగ్య సమస్యలు తీరిపోవడంతోపాటు యవ్వనంగా కనిపించే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే 50 ఏళ్ల వయస్సులోనూ 20 ఏళ్లలా మెరిసే చర్మం సాధ్యమవుతుంది. కొన్ని “సూపర్ ఫుడ్స్” తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా ఉంటుంది. ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బెర్రీస్

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడి, ముడతలు రాకుండా సహాయపడతాయి.

2. ఆకుకూరలు, కూరగాయలు

పాలకూర, బ్రోకలీ లాంటి ఆకుకూరల్లో విటమిన్ A, C, K ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను నివారించి, సహజమైన మెరుపును అందిస్తాయి. ప్రతిరోజు ఇవి తీసుకోవడం శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.

3. అవకాడో

ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి తేమనిస్తుంది. అవకాడో వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా ఉంటుంది.

4. డ్రై ఫ్రూట్స్, విత్తనాలు

బాదం, వాల్‌నట్స్, కిస్మిస్, గుమ్మడి గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ Eతో సంపూర్ణం. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.

5. గ్రీన్ టీ

గ్రీన్ టీ మెటబాలిజం మెరుగుపరుస్తుంది, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుంది. సాధారణ టీ, కాఫీకి బదులుగా దీనిని తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన

30 ఏళ్ల తర్వాతే సరైన పోషకాహారం అలవాటు చేసుకోవడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో ముడతలు, మచ్చలు రాకుండా ఉంటుంది. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగడం ద్వారా చర్మం హైడ్రేటెడ్‌గా మెరిసిపోతుంది.

Follow Us