హైదరాబాద్ అత్తాపూర్ సమీపంలో సయ్యద్ గౌస్ అనే వ్యక్తి భార్య, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు, తన బాధలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తన పిల్లల బాధ్యతను సోదరుడు చూసుకోవాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.